ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభ్యం | The former MLA of Khammam is available | Sakshi
Sakshi News home page

ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభ్యం

Published Tue, Jun 27 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభ్యం

ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభ్యం

రైల్వేకోడూరు/తిరుపతిక్రైం: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవ డానికి వచ్చి తప్పిపోయిన తెలంగా ణలోని ఖమ్మం మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షంను గుర్తించినట్లు టాస్క్‌ ఫోర్స్‌ ఐజీ కాంతారావు తెలిపారు. వైఎస్‌ఆర్‌ జిల్లా రైల్వేకోడూరులోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలే కర్లతో మాట్లాడారు.

బిక్షంకు మతిస్థిమితం సరిగాలేదని, తిరుమలలో స్వామిని దర్శించుకుని వెళుతుండగా ఆది వారం సాయంత్రం తప్పిపోయారని సమాచారం వచ్చిందన్నారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తుండగా సోమవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం కరకంబాడి అటవీ సమీపంలో గుర్తించామన్నారు. ఆయనను వారి బంధువులకు అప్పగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement