నిజాంసాగర్ : మండల కేంద్రానికి సమీపంలోని పెద్దపూల్ బ్రిడ్జిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రో డ్డు ప్రమాదంలో నీరుడి సాయిలు (30) మరణించాడు. బ్రిడ్జిపై ఉన్న గుంతల వల్లే ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తూ మృతుడి బంధువు లు రాస్తారోకో చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాగి గ్రామానికి చెందిన నీరుడి సాయిలు గాయత్రి కర్మాగారంలో పర్మినెంట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
కర్మాగారంలో డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటి నుంచి బైక్‌పై మండల కేంద్రానికి బయలుదేరాడు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న మంజీర నది బ్రిడ్జిపైన ఏర్పడిన గుంతల్లోంచి బైక్ వెళుతున్నప్పుడు కిందపడిపోయాడు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన వాహనం అతడి తల, వీపు భాగాలపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ దారిలో వెళ్తున్న వారు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వచ్చారు. ప్రమాదానికి కారణమైన వాహనాల కోసం గాలించారు.
మృతుడి బంధువుల రాస్తారోకో
పెద్దపూల్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు, మాగివాసులు సం ఘటన స్థలం వద్ద రాస్తారోకోకు దిగారు. సాయి లు మృతికి ఆర్‌ఆండ్‌బీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బ్రిడ్జిపై గుంతలను పూడ్చాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాలుగు గంటలపాటు ఆందోళన కొనసాగింది. బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డి అక్కడి చేరుకొని బాధితులతో మాట్లాడి, శాంతింపజేశా రు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Sun, Dec 28 2014 1:06 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement