తెలంగాణ రాష్ట్ర బీజేపీ నిర్ణయం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ నిర్ణయించింది. పార్టీ పదాధికారులు, మీడియా నిర్వహణ, అధికార ప్రతినిధుల సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, నల్లగొండ జిల్లాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని వివరించారు.
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ విదేశి పర్యటనల ద్వారా దేశ ప్రతిష్టను మరింతగా పెంచుతున్నారని జాతీయ అధికార ప్రతినిధి విజయ్ సోన్కర్‌సింగ్ అన్నారు. విదేశాల్లో లీగల్‌సెల్ ప్రతినిధి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని వ్యాఖ్యానించారు. సమావేశంలో బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర విజయాలపై విస్తృత ప్రచారం
Published Sat, May 23 2015 6:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM
Advertisement
Advertisement