వాళ్లకు బెయిల్ రద్దు చేయాలి: ఓవైసీ
Published Fri, Mar 24 2017 7:36 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
- జీరో అవర్‌లో డిమాండ్ చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల నిందితుడు స్వామి అసీమానందకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనసభ జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మక్కామసీదు పేలుళ్ల ఘటనలో చాలా మంది అమాయక ముస్లింలు చనిపోయారని, దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేసి అసీమానందన దోషిగా తేల్చిందని గుర్తు చేశారు.
ఒకవైపు కేంద్రం తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. అందరికీ సమన్యాయం చేస్తామని బహిరంగంగా చెబుతోందని, మరి ఈ విషయంలో హిందూత్వ శక్తులకు మాత్రమే రక్షణ సూత్రం వర్తింజేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. మంజూరు చేసిన బెయిల్ రద్దయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కేసులు న్యాయ విచారణ చేసిన భాస్కర్‌రావు కమీషన్ నివేదికను సైతం ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక మక్కామసీదు అల్లర్లలో కాల్పులకు పాల్పడి కొందరి ముస్లింల మరణానికి కారణమైన అధికారే చిత్తూరు ఎస్పీగా ఉండి ఎన్‌కౌంటర్‌లకు పాల్పడ్డారని, ఆయనపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందిస్తూ, అసీమానంద బెయిల్‌రద్దు చేసేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఎన్‌ఐఏ చేస్తున్న దర్యాప్తుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
Advertisement
Advertisement