మళ్లీ కరెంట్ కోతలు | Then again, the current cuts | Sakshi
Sakshi News home page

మళ్లీ కరెంట్ కోతలు

Published Sat, Sep 13 2014 2:15 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

మళ్లీ కరెంట్ కోతలు - Sakshi

మళ్లీ కరెంట్ కోతలు

- నేటి నుంచి అమలు
- ఆదేశాలు జారీ చేసి ఎన్‌పీడీసీఎల్ సీఅండ్ ఎండీ
మంథని/జగిత్యాల అగ్రికల్చర్ : మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యూరుు. ఈమేరకు శుక్రవారం ఎన్‌పీడీసీఎల్ సీఅండ్ ఎండీ ఆదేశాలు జారీచేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు( సబ్‌స్టేషన్ హెడ్‌క్వార్టర్)ల్లో 8 గంటలు, కార్పొరేషన్లలో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటల కోత ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయూనికి 7 గంటల సరఫరా జరుగుతుండగా పెరిగిన డిమాండ్ కారణంగా అరుుదు గంటల సరఫరా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
 
కోతలు ఇలా...

మున్సిపాలిటీలు (సబ్‌స్టేషన్ హెడ్‌క్వార్టర్), మండల కేంద్రాలు:
ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు

కార్పొరేషన్లు
ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

గ్రామాలు:
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (12 గంటల కోత)

గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఇలా...
  ఎ-గ్రూప్‌లో ఉదయం 3 గంటల నుంచి 8 గంటల వరకు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు
  బి- గ్రూప్‌లో ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు. రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు
  సి- గ్రూప్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు. రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు
  డి- గ్రూప్‌లో రాత్రి 10 నుంచి 3 గంటల వరకు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement