
సాక్షి, హైదరాబాద్: నగరంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం(3న) జరగనున్న ఈ పరీక్ష కోసం 101 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు సుమారు 49 వేల మంది అభ్యర్థులు హజరుకానున్నారు.
మొదటి పేపర్‌కు ఉదయం 9.20 వరకు, రెండో పేపర్‌కు మధ్యాహ్నం 2.20 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి సాంకేతిక పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. యూపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఈ–అడ్మిట్ కార్డును మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ గుర్తింపు కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment