ప్రతీకాత్మక చిత్రం
నిజామాబాద్‌అర్బన్ : స్కిజోఫ్రీనియా వ్యాధి తీవ్రమైన మానసిక రుగ్మత, ప్రతి వంద మందిలో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు. ఈ వ్యాధి 17–40 సంవత్సరాలలో ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. కొంత మందిలో 40 సంవత్సరాలు దాటిన కూడా రావచ్చు. ఈ వయస్సులో ఆడవాళ్లకు ఎక్కువగా వస్తుంది. ఆడవారితో పోలిస్తే ఈ వ్యాధి మగవారిలో తక్కువ వయస్సులోనే వస్తుంది. మనోబలంతో ఈవ్యాధిని జయించవచ్చు.
రెండు రకాల లక్షణాలు హల్యుసినేషన్స్
వీరికి చుట్టూ వ్యక్తులు లేకపోయిన స్పష్టంగా మాటలు వినపడతాయి. మెదుడులో రసాయనాల మార్పిడితో నిజంగానే మాటలు వినబడతాయి. ఈ వినపడే మాటాలకు ప్రతి స్పందనగా వీరు మాట్లాడుకుంటుంటారు. ఈ మాటలు వీరు ఊహించుకుంటారు.
దీంతో వ్యాధి సోకిన వ్యక్తి తనలోతాను నవ్వుకుంటు, తనలో తను మాట్లాడుకుంటున్నట్లు ఇతరులకు కనిపిస్తారు. క్రమేణ ఈ మాటలు నిజం అని ధృడంగా నమ్మతారు. వాస్తవానికి ఇవి నిజాలు కాకపోవడంతో సమాజాన్ని ఎక్కువగా అనుమానిస్తాడు. వాటినే డెల్సుషన్స్ అని అంటారు.
వింతగా ప్రవర్తిస్తుంటారు. రోజువారి విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవడం, స్నానం చేయకపోవడం, బట్టలు మార్చుకోకపోవడం.ఆలోచన అర్థం వర్ధం లేకుండా ఉండటం, మాటకూడా అస్పష్టంగా అర్థం కాకుండా ఉంటుంది.
వ్యాధి ప్రారంభానికి ముందు లక్షణాలు
ఈ వ్యాధి ప్రారంభంలో వారు తమ పనులు చేసుకోవాడానికి కావలసిన ఫోకస్ కోల్పొతారు. ఏదైనా ఉద్యోగం ప్రారంభంలో బాగా చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తికమక చెందుతారు. పనిని సగంలో వదిలేస్తారు.
ఆ తర్వాత కాలేజీ, ఉద్యోగం వెళ్లడం మానివేసి ఇంట్లోనే ఉండటం ఆరంభిస్తారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించడం కష్టం. ఒకవేళ గుర్తించి చికిత్సను అందిస్తే వారిలో కలిగే మనో క్షీణతను ఆపవచ్చు. వంశంలో, కుటుంబంలో ఈ వ్యాధి ఉన్నవారు తొలి దశలోనే గుర్తించి జాగ్రత్త పడవచ్చు.
ఈ వ్యాధి ఆలోచన, ఆచరణ, భావావేశాల మధ్య సమన్వయం తీవ్రంగా దెబ్బ తింటుంది. అంటే మనసులోని ముఖ్య విధుల మధ్య చీలిక ఏర్పడుతుంది.అందుకే స్కిజోఫ్రినియా అంటే చీలిపోయిన మనసు అన్నారు.
ఎలా వస్తుంది....
వ్యాధి లక్షణాలు ఒక్కసారిగా కనబడవు. మనోబలం కోల్పోతారు. లక్షణాలు బయటపడకముందే వ్యాధిని గుర్తించి చికిత్స చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి పలు దశలలో అనగా కుటుంబచరిత్ర(జన్యుపరమైన కారణాలు), వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ప్రసవం జరిగేటప్పుడు, ప్రసవం అయిన తర్వాత పెరిగే దశలలో ఏదేని కారణాల వలన నాడికణాల ఎదుగుదల అపసవ్యంగా జరుగుతుంది.
ఆ తర్వాత తల్లిదండ్రుల పెంపకం, టినేజి, తొలి యవ్వన దశలో తనకు కలిగే ఒత్తిడి వలన మెదడు రసాయనాలలో శాశ్వత మార్పులు జరిగి వ్యాధి బయటపడుతుంది. వ్యక్తి తీవ్రమైన ప్రవర్తనతో చుట్టు ఉన్న వారికి గాని, తనకు గాని ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు అందరికి దృష్టిలోకి వస్తుంది.
దీనిని ఈ ఉదాహరణతో చెప్పవచ్చు. ఎదేని ఒక బ్రిడ్జి యొక్క నిర్మాణం యొక్క పలు దశలలో లోపం జరిగి ఉండవచ్చు. దానిని ఉపయోగంలోకి తెచ్చిన తర్వాత అది తట్టుకునే సామర్థానికి దాటిలోడు(బరువు) పడినప్పుడు మాత్రమే బ్రిడ్జి కూలిపోతుంది.
వ్యాధి చికిత్స–నివారణ చర్యలు
ఈ వ్యాధి ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. ఈ మందులు మెదడులో జరిగే మార్పులను యధావిధిగా సాధారణ స్థాయిలో ఉంచడానికి తోడ్పడాతాయి. మందులు ఆపివేస్తే వ్యాధి ముదిరే అవకాశం ఉంటుంది. అంటే రక్తపోటు, మధుమేహం మందులాలగా మందులు వాడుతూ లక్షణాలను నియంత్రణలోకి పెట్టుకోవాలి.
స్కిజోఫ్రినియాతో బాధపడేవారు తను అసాధారణంగా ఉన్నాను. తను మందులు వాడాలి అన్న స్పృహ కలిగి ఉండరు. వ్యాధి లక్షణాలు తగ్గిన తర్వాత ఈ అంతర్ దృష్టి పూర్తిగా వచ్చినచోరోగి మందులు తనకు తానుగా వాడుకో గలుగుతాడు. అందుకే చాలా మంది రోగులు మందులు ఆపివేస్తుంటారు.
కొంత మంది రోగులు లేదా వారి బంధువులు మందులతో సైడ్ ఎఫెక్టస్ కలుగుతున్నాయని , కలుగుతాయేమోనని మానసిక వైద్యంపై అవగాహన లేనివారి మాటలు విని బంధువులు నివసించడం ముఖ్యం. రోగికి స్వతహాగ మందులు మింగుతున్నాడా అని పరిశీలిస్తుండాలి, రోగికి గుర్తు చేస్తుండాలి.
చికిత్స తీసుకోవాలి
ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడంతో చాలాసార్లు ఈ లక్షణాలు చేతబడి, మనిశికోడి, దేవుని కోడి, దయ్యం పట్టింది. చెడుగాలితో కల్గిందని చికిత్స తీసుకోకుండా వ్యాధి తీవ్రత పెరిగే వరకు సమయాన్ని వృథా చేస్తుంటారు.
దీని వలన పూర్తిగా మేధో క్షీణత జరిగిపోతుంది. వ్యాధి తొలిదశలోనే గుర్తించి తొందరగా చికిత్స ప్రారంభిస్తే సుమారుగా 20 శాతం రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. 5–6 శాతం రోగులు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. వెంటనే చికిత్స తీసుకోవాలి. – డా.అచ్చంపేట వికాస్, మానసిక వైద్యుడు
Comments
Please login to add a commentAdd a comment