
అటవీ సిబ్బందిపై గిరిజనుల దాడి
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలో గిరిజనులు అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. మండల పరిధిలోని బండారుగుంపు వద్ద అటవీ భూముల్లో గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు జగన్నాథపురం సెక్షన్‌కు చెందిన అటవీశాఖ సిబ్బంది వాహనంలో వెళ్లగా... వారిని పోడు సాగుదారులు అడ్డుకున్నారు. దాడికి దిగడంతోపాటు జీపును ధ్వంసం చేశారు. దీంతో అటవీశాఖ సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.