టర్కీ కాన్సులేట్ ప్రారంభం | Turkey consulate has launched | Sakshi
Sakshi News home page

టర్కీ కాన్సులేట్ ప్రారంభం

Published Mon, Mar 23 2015 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

టర్కీ కాన్సులేట్ ప్రారంభం

టర్కీ కాన్సులేట్ ప్రారంభం

హైదరాబాద్: దేశాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో రిపబ్లిక్ టర్కి కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కార్యాలయ కార్యకలాపాలను ఆయన హైదరాబాద్ టర్కీ కాన్సులేట్ జనరల్ మురాక్ ఓమెరెగ్లూతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి విదేశీ వ్యవహారాలకు సంబంధించి రాయబార కార్యాలయం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు.

టర్కీకి వెళ్లాలనుకునే వారికి ఇక్కడ తేలిగ్గా వీసా సదుపాయం లభిస్తుందని చెప్పారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాలకు చెందిన వారు తేలిగ్గా టర్కీకి వెళ్లాలనుకుంటే ఇక్కడ వీసా తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి వీసాను సినీ నటి లక్ష్మీ మంచుకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement