నల్లగొండ: ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరి వ్యక్తులకు కాళ్లు విరగి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన పాలడుగు సైదులు(23), కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన బొల్లేపల్లి ఉదయ్(25) ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మోటారుసైకిల్‌పై నకిరేకల్‌కు వెళ్తున్నారు. అదే సమయంలో మండలంలోని ఇటుకులపహాడ్ సమీపంలోని మూసీ నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్ గ్రామంలోని ఉన్నత పాఠశాల వద్ద అకస్మాత్తుగా మలుపు తిప్పటంతో బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సైదులు, ఉదయ్‌లకు కాళ్లు విరగడంతో పాటు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్ కు తరలించారు.