సాగర్ విద్యుత్ కేంద్రంలో రెండు టర్బైన్లు మునక | Two turbines to sink in Nagarjuna Sagar power plant center | Sakshi
Sakshi News home page

సాగర్ విద్యుత్ కేంద్రంలో రెండు టర్బైన్లు మునక

Published Fri, Sep 19 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

Two turbines to sink in Nagarjuna Sagar power plant center

నాగార్జునసాగర్ : సాగర్ ఎడమకాల్వపై ఉన్న 60 మెగావాట్ల విద్యుద్యుత్పాదక కేంద్రంలోకి గురువారం సాయంత్రం ఒక్కసారిగా నీరు వచ్చి చేరింది. దీంతో రెండు టర్బైన్లు మునిగాయి. ఒక  టర్బైన్‌లో మరమ్మతులు జరుపుతున్న క్రమంలో పెన్‌స్టాక్ సీళ్లు లీకయి మరమ్మతులు చేసే టర్బైన్‌లోకి నీళ్లు వచ్చాయి. నీటిని తోడి టర్బైన్‌లకు సీల్ వేయడానికి గజ ఈతగాళ్లు ప్రయత్నించినా వీలు కాలేదు. రెండు యూనిట్లలోకి నీరు చేరడంతో అవి మునిగిపోయాయని జెన్‌కో అధికారులు చెప్పారు. కాగా, విద్యుత్ కేంద్రంలోకి చేరిన నీటిని తోడి..రెండు మూడు రోజుల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలంగాణ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement