గుర్తుతెలియని బాలికను చేరదీసిన పోలీసులు | Unidentified girl in police station | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని బాలికను చేరదీసిన పోలీసులు

Published Sat, Apr 21 2018 12:04 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

Unidentified girl in police station - Sakshi

తప్పిపోయిన బాలికతో ఎస్సై రవి

తాండూర్‌(బెల్లంపల్లి) : ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చిన బాలిక (7)ను శుక్రవారం తాండూర్‌ పోలీసులు చేరదీశారు. తాండూర్‌ మండలం బోయపల్లి శివారులోని మామిడి తోటల సమీపంలో రోడ్డు పక్కన చెట్టు కింద బాలిక కూర్చోని ఉండగా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సై కె.రవి ఆ బాలికను గమనించి ఆమె వివరాలు అడిగితెలుసుకునే ప్రయత్నం చేశారు.

తనది కెరమెరి గ్రామమని ఓసారి, జోడేఘాట్‌ అని ఓ సారి బాలిక చెప్పడంతో బాలిక వివరాలు తెలియరాలేదు. తప్పిపోయిన బాలిక సంబంధికులు ఎవరైనా ఉంటే తాండూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై రవి సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement