హైదరాబాద్: ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవలందించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ గ్రామకార్యదర్శులకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోతెలంగాణ గ్రామపంచాయతీ కార్యదర్శుల డైరీ, కరదీపికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిలో గ్రామకార్యదర్శుల పాత్ర కీలకమన్నారు.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామాలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.