Telangana IT minister
-
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
సమస్యకు పరిష్కారం దిశగా కృషి చేస్తున్నాం
-
హరీష్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావుకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ టీడీపీ డిపాజిట్ గల్లంతు అయింది. అయితే నారాయణఖేడ్ ఉప ఎన్నికకు మంత్రి హరీష్ రావు ఇంఛార్జ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ట్విట్టర్లో ట్విట్ చేశారు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పటోళ్ల కిష్టారెడ్డి ఘన విజయం సాధించారు. కాగా ఆయన గతేడాది ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పటోళ్ల కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని నిలబెట్టింది. కాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా మహారెడ్డి భూపాల్‌రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపింది. పోటాపోటీగా ఈ ఎన్నికల ప్రచారం సాగింది. అయితే విజయం టీఆర్ఎస్ ఖాతాలో పడింది. దీంతో హరీష్‌కు ట్విటర్ ద్వారా కేటీఆర్ అభినందనలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఇంఛార్జ్‌గా వ్యవహరించి.... 99 డివిజన్లలో గులాబీ కండువా వేసిన సంగతి తెలిసిందే. TRS juggernaut continues to roll unabated. Thumping majority of over 50K in Narayankhed😊. Congrats to @trsharish & Medak TRS leadership team — KTR (@KTRTRS) February 16, 2016 -
టీడీపీది రోజుకో బాగోతం!
-
టీడీపీది రోజుకో బాగోతం!
* తెలుగుదేశం పార్టీ వైఖరిపై మంత్రి కేటీఆర్ ధ్వజం * ‘ఓటుకు కోట్లు’ కేసులో చట్టం తన పని తాను చేస్తుంది.. సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో టీడీపీది రోజుకో మాట, రోజుకో బాగోతం అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఈ కేసులో అడ్డంగా దొరికిపోవడమేకాక ఇతరులపై ఆ పార్టీ నేతలు బురదజల్లుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు, కేసీఆర్‌పై ఏపీలో కేసులు పెట్టడంపై గురువారం ఇక్కడ విలేకరులు కేటీఆర్ స్పందన కోరగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. వాస్తవంగా జరిగిందేమిటో ప్రజలు చూశారన్నారు. ఓటుకు కోట్లు కేసు గురించి అడగ్గా.. చట్టం తన పనితాను చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో ఏడాది నుంచి శాంతిభద్రతల సమస్యలేదని, భవిష్యత్‌లోనూ అలాంటి వాతావరణమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వెంకయ్య, గడ్కారీ, రవిశంకర్‌లతో భేటీ తొలుత కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. స్మార్ట్‌సిటీ, స్మార్ట్ టెక్నాలజీపై ఆగస్టు 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా రావాలని మంత్రి వెంకయ్యను కేటీఆర్ ఆహ్వానించారు. లక్షకు పైగా జనాభా ఉన్న సిద్ధిపేటను క్లాస్-1 పట్టణ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనపై ఈ సందర్భంగా వెంకయ్య సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ హడ్కో చైర్మన్ రవికాంత్‌ను కలసి వాటర్ గ్రిడ్‌కు రూ.5వేల కోట్ల రుణం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారుల స్థాయి కోసం వినతి రాష్ట్రంలోని వెయ్యి కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచాలని కేటీఆర్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌పోర్టుభవన్‌లో ఆయన గడ్కారీని కలసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి 2 లక్షల టన్నులు, రహదారులకు 8 లక్షల టన్నుల సిమెంటును రాయితీపై ఇవ్వాలని కోరారు. కాగా, రెండు పడకల గదుల ఇళ్లకు కూడా సిమెంటు రాయితీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని గడ్కారీ సూచించారని కేటీఆర్ తెలిపారు. అనంతరం ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలసి టీహబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించినట్టు కేటీఆర్ చెప్పారు. -
నితిన్ గడ్కరీతో కేటీఆర్ భేటీ
ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు జాతీయ రహదార్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని గడ్కరీని కోరారు. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రాయితీ ధరకే సిమెంటును ఇవ్వాలని కేటీఆర్ కోరారు. అంతకముందు హడ్కో చైర్మన్ రవికాంత్ తో భేటీ అయిన కేటీఆర్ తెలంగాణలో తాగునీటి పథకానికి రూ.25 వేల కోట్లు మంజారు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
'జరిగిందేమిటో ప్రపంచానికంతా తెలుసు'
-
'జరిగిందేమిటో ప్రపంచానికంతా తెలుసు'
న్యూఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిందేమిటో ప్రపంచానికంతా తెలుసునని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన స్పష్టం చేశారు. టీటీడీపీ నేతలకు పనిలేక, ఏం చేయాలో పాలుపోక తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో గురువారం న్యూఢిల్లీలో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ బేటీ అనంతరం కేటీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో శాంతిభద్రతలు చాలా బాగున్నాయని... అందరూ కలసి ఉన్నారని వెల్లడించారు. ఆగస్టులో స్మార్ట్ సిటీలపై అంతర్జాతీయ సదస్సుకు వెంకయ్యనాయుడును ఆహ్వానించామని తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం ప్రారంభించిన డబల్ బెడ్ రూమ్ పథకానికి కేంద్ర సాయం అందించాలని కోరామని చెప్పారు. తెలంగాణలో 12 క్లాస్ ఒన్ సిటీలకు ప్రతిపాదనలు పంపామని... ఆ జాబితాలో సిద్ధిపేట కూడా చేర్చాలని వెంకయ్యనాయుడును ఈ సందర్భంగా కోరామని కేటీఆర్ తెలిపారు. -
కేసీఆర్ 61 ఏళ్ల యువకుడు
-
కేసీఆర్ 61 ఏళ్ల యువకుడు
హైదరాబాద్ : ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 61 ఏళ్ల యువకుడని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ...కేసీఆర్ మహావృక్షంలాంటి వారని అభివర్ణించారు. ఆయనుంటేనే తామందరం ఉంటామన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. పార్టీలో నెంబర్ 2 అంటూ ఎవరూ లేరన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. కేసీఆర్ ఇంకా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా... పార్టీ అధ్యక్షుడిగా పని చేయాలని తామంతా కోరుకుంటున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. -
'మహిళలు తిరగబడతారనే ఇక్కడ పెట్టారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మహానాడు పెడితే రైతులు, మహిళలు చంద్రబాబుపై తిరగబడతారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ కారణం చేతనే హైదరాబాద్ నగరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌ను చంద్రబాబే అభివృద్ది చేస్తే తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయిందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే అని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబుకే అంత పలుకుబడి ఉంటే గూగుల్ సంస్థను ఏపీలో ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు మమ్మల్ని కూడా బాధిస్తోందని... వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు. -
హైదరాబాద్‌లో గూగుల్ సొంత క్యాంపస్
-
గూగుల్ సొంత క్యాంపస్
అమెరికాలో మంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారుల ఒప్పందం సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తొలిసారిగా ఆసియాలో.. అందులోనూ హైదరాబాద్‌లో సొంత క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో 7.2 ఎకరాల్లో రూ. వెయ్యి కోట్లతో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. అమెరికా వెలుపల ఉన్న గూగుల్ క్యాంపస్లలోకెల్లా ఇదే అతిపెద్దది కానుంది. అంతేకాదు, వచ్చే నాలుగేళ్లలో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేయనుంది. ఈ మేరకు గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో ఒప్పందంపై మంగళవారం ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, గూగుల్ సంస్థ ప్రెసిడెంట్ డేవిడ్ రాడ్‌క్లిఫ్ సంతకాలు చేశారు. కాలిఫోర్నియాలోని గూగుల్ సంస్థ కేంద్ర కార్యాలయం మౌంటెన్‌వ్యూలో ఈ కార్యక్రమం జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ తాజా ఒప్పందం మేరకు గూగుల్ సంస్థ ఆసియాలో తమ తొలి క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంద న్నారు. వచ్చే ఏడాది క్యాంపస్ నిర్మాణం చేపడతారని చెప్పారు. ఈ క్యాంపస్‌లో 13 వేల మంది ఉద్యోగులు పనిచేయొచ్చన్నారు. హైదరాబాద్‌లోని కొత్త ప్రాంగణాన్ని 4 ఏళ్లలో పూర్తి చేస్తామని డేవిడ్ రాడ్‌క్లిఫ్ పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయితే రెండు మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకుముందు గూగుల్ సంస్థకు చెందిన పలు విభాగాల డెరైక్టర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ర్ట విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పేందుకు, విద్యార్థుల్లో కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, కేంద్రం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమానికి కూడా గూగుల్ సహకారం కావాలని కోరారు. తెలంగాణలో గూగుల్ స్ట్రీట్ వ్యూ: ప్రముఖ నగరాల్లోని భౌగోళిక వివరాలు, దర్శనీయ ప్రదేశాలు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్ తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలను భారత్‌లో తొలిసారిగా తెలంగాణలో అందించేందుకు గూగుల్ అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని ఏ ప్రదేశ వివరాలనైనా ఎప్పటికప్పుడు తెలుసుకోగలమన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో పౌరులకు సాంకేతిక సౌలభ్యంతోపాటు వ్యాపారాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందన్నారు. స్ట్రీట్ వ్యూ సాయంతో ప్రతి భవనాన్ని మ్యాపింగ్ చేయడం ద్వారా ఆస్తి పన్నుతోపాటు ఇతర పౌర సేవల విషయంలో పౌరులకు, ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమం పట్ల గూగుల్ ప్రతినిధులు ఆసక్తిని కనబరిచారని, దీనిపై అధ్యయనం చేసేందుకు త్వరలో ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు గూగుల్ అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. -
హైదరాబాద్ లో గూగుల్ భారీ క్యాంపస్
-
గ్రామ కార్యదర్శుల పాత్ర కీలకం: కేటీఆర్
హైదరాబాద్: ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవలందించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ గ్రామకార్యదర్శులకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోతెలంగాణ గ్రామపంచాయతీ కార్యదర్శుల డైరీ, కరదీపికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిలో గ్రామకార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామాలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
రాత్రికి దుబాయ్ వెళ్లనున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం రాత్రి దుబాయ్‌కు బయలుదేరి వెళ్లారు. దుబాయ్ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన టెకామ్(టీఈసీఓఎం) సీఈఓ, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్ఐఐసీ ఎండీ, చైర్మన్ జయేశ్‌రంజన్, ఫిక్కీ ప్రతినిధులు అరుణ్ చావ్లా, అఖిలేశ్, సుకన్య పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై ఎన్ఆర్ఐలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు దుబాయ్టెక్లో ఫార్మా, ఐటీ పారిశ్రామికవేత్తలతో పాటు మీడియాతో సమావేశమవుతారు. -
కేటీఆర్ దుబాయ్ పర్యటన రద్దు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.తారకరామారావు తన దుబాయ పర్యటనను రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై రవిశంకర్ ప్రసాద్‌తో కేసీఆర్, కేటీఆర్ చర్చించనున్నారు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు ... అలాగే నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానం కోసం దుబాయ్ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ బృందం సమావేశం కావాల్సి ఉంది. కేటీఆర్ దుబాయ్ పర్యటన మళ్లీ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నామని ఆయన కార్యాలయం వెల్లడించింది. -
'విపక్షాలు తప్పించుకోవాలని చూసినా వదిలేది లేదు'
హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్, రైతుల సమస్యలపై తాము చర్చకు సిద్ధమని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో సాక్షితో కేటీఆర్ మాట్లాడుతూ... ప్రస్తుత తెలంగాణ దుస్థితికి కాంగ్రెస్, టీడీపీల పాలనే కారణమని ఆయన ఆరోపించారు. దీనిపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. విపక్షాలు తప్పించుకోవాలని చూసినా వదిలే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు తెలంగాణ గురించి మాట్లాడటం... దొంగే.. దొంగ దొంగా అన్నట్లు ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పారు. కరెంట్ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. -
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో సిబ్బంది కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో సియాజ్ కారును హైద రాబాద్ మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా చోటు చేసుకుంది. కార్యక్రమానికి ముందు వరుణ్ మోటార్స్ భవ నం మూడో అంతస్తు నుంచి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి ఆయన లిఫ్ట్‌లో కిందికి దిగుతుండగా అకస్మాత్తుగా అది ఆగిపోయింది. ఐదు నిమిషాలపాటు మంత్రి, ఎంపీ లిఫ్ట్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. మంత్రి గన్‌మెన్, వరుణ్‌మోటార్స్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆరా తీయగా కింది ఫ్లోర్లో దాని గేటు ఓపెన్ చేసినట్లు తెలిసింది. వెంటనే లిఫ్ట్ గేటును వేయడంతో మళ్ళీ లిఫ్ట్ కదిలింది.