
'విపక్షాలు తప్పించుకోవాలని చూసినా వదిలేది లేదు'
హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్, రైతుల సమస్యలపై తాము చర్చకు సిద్ధమని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో సాక్షితో కేటీఆర్ మాట్లాడుతూ... ప్రస్తుత తెలంగాణ దుస్థితికి కాంగ్రెస్, టీడీపీల పాలనే కారణమని ఆయన ఆరోపించారు. దీనిపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు.
విపక్షాలు తప్పించుకోవాలని చూసినా వదిలే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు తెలంగాణ గురించి మాట్లాడటం... దొంగే.. దొంగ దొంగా అన్నట్లు ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పారు. కరెంట్ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు.