
కేసీఆర్ 61 ఏళ్ల యువకుడు
హైదరాబాద్ : ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 61 ఏళ్ల యువకుడని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్లో కేటీఆర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ...కేసీఆర్ మహావృక్షంలాంటి వారని అభివర్ణించారు. ఆయనుంటేనే తామందరం ఉంటామన్నారు.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. పార్టీలో నెంబర్ 2 అంటూ ఎవరూ లేరన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. కేసీఆర్ ఇంకా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా... పార్టీ అధ్యక్షుడిగా పని చేయాలని తామంతా కోరుకుంటున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.