
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో సిబ్బంది కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో సియాజ్ కారును హైద రాబాద్ మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా చోటు చేసుకుంది. కార్యక్రమానికి ముందు వరుణ్ మోటార్స్ భవ నం మూడో అంతస్తు నుంచి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి ఆయన లిఫ్ట్‌లో కిందికి దిగుతుండగా అకస్మాత్తుగా అది ఆగిపోయింది. ఐదు నిమిషాలపాటు మంత్రి, ఎంపీ లిఫ్ట్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. మంత్రి గన్‌మెన్, వరుణ్‌మోటార్స్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆరా తీయగా కింది ఫ్లోర్‌లో దాని గేటు ఓపెన్ చేసినట్లు తెలిసింది. వెంటనే లిఫ్ట్ గేటును వేయడంతో మళ్ళీ లిఫ్ట్ కదిలింది.