వరంగల్-హైదరాబాద్ హైవేపై టోల్ ఫీజు
రోడ్డు పూర్తయితే రెండు చోట్ల చెల్లింపులు
28 బ్రిడ్జిలు, నాలుగు బైపాస్‌లు
రూ.1905 కోట్ల నిధులతో విస్తరణ
2018 జూన్ నాటికి పనులు పూర్తి
వరంగల్ : వరంగల్-హైదరాబాద్ రోడ్డు త్వరలో నాలుగు వరుసల రహదారిగా మారనుంది. 99 కిలో మీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు 30 నెలల్లోనే పూర్తికానున్నాయి. వాహనాల రద్దీతో ప్రస్తుతం ఈ రోడ్డుపై ప్రయూణం ఇబ్బందిగా మారింది. విస్తరణ పూర్తయితే హైదరాబాద్‌కు సులభంగా తక్కువ సమయంలో నే చేరుకునే అవకాశం ఉంటుంది. అరుుతే, రూ.1905 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పను లు పూర్తి కాగానే వాహనదారులకు సుఖమెన ప్రయాణంతోపాటు టోల్ ఫీజు రూపంలో జేబులు ఖాళీ కానున్నా యి. హైదరాబాద్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం బీబీనగర్ వద్ద టోల్‌గేటు ఉంది. వాహనదారులు ప్రస్తుతం అక్కడ ఒక్కచోటే టోల్‌ఫీజు చెల్లిస్తున్నారు. తాజాగా చేపట్టిన రోడ్డు విస్తరణ పూర్తయితే మరో టోల్ గేటు ఏర్పాటు చేస్తారు. అప్పుడు రెండు చోట్ల టోల్‌ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా టోల్ ఫీజు ప్రతి ఏటా పది శాతం వరకు పెరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు.
నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి నుంచి వరంగల్ జి ల్లా హసన్‌పర్తి మండలం ఆరెపల్లి వరకు 99 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో హైదరాబాద్ రహదారిలో 89వ కిలోమీటరు వద్ద టోల్‌గేట్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జనగామ మండలం యశ్వంతాపూర్ వద్ద ప్రస్తుతం 89వ కిలోమీట రు మైలు రాయి ఉంది. ఆరెపల్లి నుంచి లెక్కిస్తే మాత్రం ప్రదేశం మారే అవకాశం ఉంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్-వరంగల్ రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు మొదలవుతున్నాయి. 2018 జూన్ వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం కె.చంద్రశేఖరరావు ఈనెల 4న రోడ్డు పనులను ప్రారంభిం చారు. హైదరాబాద్ ప్రయాణం వేగంగా పూర్తయ్యేందుకు అనువుగా గ్రేటర్ వరంగల్ నగరం(బైపాస్) వెలుపలి నుంచి రహదారిని నిర్మిస్తున్నారు. జనగామ, ఆలేరు, వంగపల్లిలోనూ ఇదే రకంగా బైపాస్ నిర్మిస్తారు.
టోల్‌గేట్ @ యశ్వంతాపూర్
Published Fri, Jan 8 2016 2:28 AM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
Advertisement