మెదక్ (దుబ్బాక) : ఉపాధి లేక, మరమగ్గాల కోసం పెట్టిన పెట్టుబడి రాక మనస్తాపానికి గురైన ఓ చేనేత కార్మికుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన కాల్వ ధర్మయ్య (59) మరమగ్గాల కోసం సుమారు రూ.3 లక్షల వరకు పెట్టిన పెట్టుబడులు రాకపోవడం, ఉపాధి కూడా అంతంత మాత్రమే దొరకడంతో కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. ధర్మయ్య 15 ఏళ్లుగా నీలకంఠ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. 2003 నుంచి 2008 వరకు చేనేత సహకార సంఘం కార్యదర్శిగా పని చేశారు.