సాక్షి, హైదరాబాద్: కిలో అంటే వెయ్యి గ్రాము లు కదా... కానీ, చికెన్, మటన్ షాపుల్లో కిలో అంటే 900 గ్రాములే... అవును, ఇది నిజమే. చికెన్, మటన్‌షాపుల్లో వినియోగదారులకు దక్కేది అంతే. 10కిలోలు తీసుకుంటే కిలో తక్కువ తూకం వస్తుంది. చికెన్, మటన్ షాపు ల్లోని ఎలక్ట్రానిక్ కాంటా సెట్టింగ్‌లో ఫిట్టింగ్ ఇది. కాంటాలో చూడటానికి కిలో చికెన్ 1,000 గ్రాముల డిస్‌ప్లే ఉంటుంది. పాతకాలపు నాటి త్రాసు కాదు కదా.. ఎలక్ట్రానిక్ కాంటా కదా. చేతివాటం ఉండదని వినియోగదారులు నమ్మి మోసపోతున్నారు.
రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో తూనికలు, కొలతల శాఖ బృందాలు జరిపా యి. ఈ సందర్భంగా పలు చికెన్, మటన్ సెం టర్లలో మోసాలు బయటపడ్డాయి. స్టాంపింగ్, రెన్యువల్ లేకుండా ఎలక్ట్రానిక్ కాంటాలు, వేయింగ్ మెషిన్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో పలు చికెన్ సెంటర్లపై తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ సంజయ్‌కృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా అలీ కేఫ్ వద్ద ఉన్న కేజీఎన్, న్యూ కేజీఎన్, ఫేమస్, రాయల్ చికెన్ సెంటర్లల్లో కిలోకి 100 గ్రాములు తక్కువగా తూకం వేస్తున్నట్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్ కాంటాపై 900 గ్రాముల చికెన్ పెడితే 1,000 గ్రాములుగా డిస్‌ప్లే చూపిస్తోంది. అదే 1000 గ్రాముల చికెన్ పెడితే 1100 గ్రాములు డిస్‌ప్లే చూపిస్తోంది. దీంతో 100 గ్రాముల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
10 కిలోలకు కిలో చికెన్ తక్కువగా తూకం వస్తున్నట్లు పసిగట్టారు. దీంతో 10 కేసు లు నమోదు చేశారు. మరో ఆరుగురు దుకాణదారులు వేయింగ్ మెషిన్లను రెన్యువల్ చేయకుండానే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా చికెన్, మటన్ మార్కెట్లు, సెంటర్లపై దాడులు చేసి యూసుఫ్‌గూడలో 13, ఫలక్‌నుమాలో 6, సికింద్రాబాద్‌లో 6 కేసులు నమో దు చేశారు. తూకం, మోసాలకు పాల్పడితే వినియోగదారులు తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆ శాఖాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment