60 ఏళ్ల వయసులో మగబిడ్డ! | woman gives birth to son at the age of 60 | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల వయసులో మగబిడ్డ!

Published Fri, Mar 6 2015 8:33 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

60 ఏళ్ల వయసులో మగబిడ్డ!

60 ఏళ్ల వయసులో మగబిడ్డ!

దేవరకొండ (నల్లగొండ):
ఆరు పదులు దాటిన వయసులో గర్భం దాల్చి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. పుత్రుడు పుడితే పున్నామ నరకం తప్పుతుందన్న నమ్మకమో, కొడుకైతే తనను చూసుకుంటాడన్న ఆరాటమో గానీ.. ఇన్నేళ్ల తర్వాత ఆమె మగ సంతానాన్ని పొందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలో చోటు చేసుకుంది.

పెద్ద అడిశర్లపల్ల్లి మండలం వద్దిపట్ల గ్రామం బల్డితండాకు చెందిన లక్ష్మా, రుక్మి(60) దంపతులకు 8 మంది ఆడపిల్లలు పుట్టారు. వీరిలో ఐదుగురు చనిపోగా మిగిలిన ముగ్గురిలో ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి. వాళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, మగ పిల్లల్లేరన్న బాధ ఆ దంపతులను వేధిస్తోంది. దీంతో రుక్మి మరోసారి గర్భం దాల్చింది. గురువారం రాత్రి దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాధారణ కాన్పు జరిగి, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రుక్మి కూతుళ్లలో ఒకరైన బుజ్జికి ఇప్పటికే ఒక మగ, ఆడ పిల్లలున్నారు. ఇప్పుడు తనకు కొత్తగా వచ్చిన బుజ్జి తమ్ముడిని ఎత్తుకుని ముద్దాడుతూ మురిసిపోయింది.

Advertisement
Advertisement