మహబూబ్‌నగర్ క్రీడలు : జిల్లా స్టేడియంలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్‌కు మహర్దశ కలగనుంది. స్టేడియంలో ఆధునీకరణ పనుల కోసం రూ.2కోట్ల 50లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికే స్టేడియం మైదానంలో లేవలింగ్ పను లను ముమ్మరంగా చేపడుతున్నారు. దా దాపు రూ.70లక్షల నిధులతో స్విమ్మింగ్‌పూల్ ఆధునీకరణ చేపట్టనున్నారు. రెండు రోజుల నుంచి పూల్‌లో మరమ్మతులు పనులు జరుగుతున్నాయి.
అన్ని సౌకర్యాలకు ప్రణాళికలు
స్విమ్మింగ్‌పూల్‌లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి జిల్లా క్రీడాశాఖ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పూల్‌లోని స్నానపు, మూత్రలశాలలు గదుల మరమ్మతులు, ఫ్లోరింగ్, పాత జిమ్‌సెంటర్‌లో డీఎస్‌ఏ కార్యాలయం ఏర్పాటుతోపాటు బేబిపూల్, ఓపెన్ షవర్లు, పంప్‌రూం, భవన మరమ్మతులు చేపట్టనున్నారు. నూతనంగా స్టోర్ రూం నిర్మించనున్నారు. పూల్‌లో ఆధునీకరణ పనులు జరుగుతుండడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో అన్ని సౌకర్యాలు
వేసవి సెలవుల్లో స్విమ్మింగ్‌పూల్‌కు అన్ని వయస్సుల వారు ఎక్కువగా వస్తారు. పూల్‌లో వారికి అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. వేసవి వచ్చేలోపు పూల్‌లో ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం.
– టీవీఎల్ సత్యవాణి, డీవైఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment