Swimming pools
-
నార్సింగిలో విషాదం: ఫంక్షన్‌కు వచ్చి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన బాలుడు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ స్విమ్మింగ్‌పూల్‌లో పడి శ్యామ్ అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వచ్చిన శ్యామ్... స్విమ్మింగ్‌పూల్ వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడకు చెందిన శ్యామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. (చదవండి: మహిళా సర్పంచ్‌కు వరకట్న వేధింపులు) -
నిబంధనలు గాల్లో.. ప్రాణాలు ‘పూల్’లో..
సాక్షి, విశాఖపట్నం: స్విమ్మింగ్ పూల్.. ఎక్కడ కనిపించినా ఈత కొట్టాలన్న ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హోటల్స్, రిసార్టుల్లో బస చేసే ముందు అందరూ అడిగేది ఒక్కటే.. మీ దగ్గర స్విమ్మింగ్‌పూల్ ఉందా అని. అంతలా ఆకర్షిస్తున్న స్విమ్మింగ్‌పూల్‌కి అనుగుణంగా లైఫ్‌గార్డులు ఉన్నారా..? నిబంధనలు పాటిస్తున్నారా? అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా సరదా స్విమ్మింగ్ ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. గురువారం నగరంలోని ఓ ప్రైవేట్ రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌లో ప్రమాదవశాత్తూ తొమ్మిదేళ్ల చిన్నారి జారిపడి మృత్యువాత పడింది. ఈ ఘటన నగరంలో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో నగరంలోని రిసార్టులు, హోటల్స్‌లో గల స్విమ్మింగ్‌పూల్స్ వద్ద లైఫ్‌గార్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) తాజాగా నోటీసులు జారీ చేసింది. కనిపించని లైఫ్‌గార్డులు నగరంలో ప్రైవేట్ హోటల్స్, రిసార్టుల్లో సుమారు 30కి పైగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించకపోవడం గమనార్హం. ప్రతి స్విమ్మింగ్ పూల్ వద్ద కచ్చితంగా పూల్ సామర్థ్యం బట్టి లైఫ్‌గార్డులు ఉండాలి. కానీ ఏ ఒక్క ఈత కొలను వద్ద ఒక్క లైఫ్గార్డుని కూడా ఆయా యాజమాన్యాలు నియమించలేదు. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే హోటల్, రిసార్టుల్లో పని చేసే సిబ్బందిని వినియోగించుకుంటున్నారే తప్ప.. నిబంధనలను మాత్రం పాటించడం లేదు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరూ నిబంధనలు పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. సామర్థ్యాన్ని బట్టి.. లైఫ్‌గార్డులు హోటల్స్, రిసార్టుల్లో బస చేస్తున్న వారి సామర్థ్యాన్ని బట్టి లైఫ్‌గార్డులు ఉండాలి. స్విమ్మింగ్‌పూల్స్ వద్ద స్విమ్మింగ్ ఫ్లోటింగ్ ట్యూబ్స్, స్టిక్స్ అందుబాటులో ఉంచాలి. పిల్లలు ఈతకొట్టేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ సేవర్స్ కచ్చితంగా ఉంటేనే ఈత కొట్టేందుకు అనుమతులు ఇవ్వాలి. లేదంటే ఆ రోజు స్విమ్మింగ్ పూల్ ప్రవేశాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాలి. పూల్ సైజ్, స్విమ్మర్స్ ఎంత మంది వినియోగించుకుంటున్నారనే విషయాల్ని పరిగణనలోకి తీసుకొని ఒకటి నుంచి నలుగురు లైఫ్‌గార్డుల్ని నియమించాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ఒక్క దాంట్లోనూ లైఫ్ సేవర్స్ లేకపోవడం శోచనీయం. నిబంధనలపై శాప్ నోటీసులు ప్రతి పూల్‌లో గార్డులను ఏర్పాటు చేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి స్విమ్మింగ్‌పూల్ నిర్వాహకులకు నోటీసులు అందిస్తోంది. పూల్ సామర్థ్యానికి అనుగుణంగా లైఫ్‌గార్డుల్ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. ఇందు కోసం రాష్ట్రీయ లైఫ్ సేవింగ్స్ సొసైటీ(ఏపీఆర్ఎల్ఎస్ఎస్) అందించే స్విమ్మర్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం తగదు ప్రైవేట్ స్విమ్మింగ్‌పూల్స్‌లో చాలా వరకూ నిబంధనలు పాటించడం లేదు. పీఆర్ఎల్ఎస్ఎస్ ఆధ్వర్యంలో లైఫ్‌గార్డులకు శిక్షణ అందిస్తున్నాం. శాప్ ఆధ్వర్యంలో వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తున్నాం. పూల్స్ వద్ద లైఫ్‌గార్డులు ఉంటే.. విషాద ఘటనలు ఇకపై ఏ ఈత కొలను వద్ద కూడా చోటుచేసుకోవు. – బలరాం, రాష్ట్రీయ లైఫ్ సేవింగ్స్ సొసైటీ ఏపీ అధ్యక్షుడు -
Medchal: స్విమ్మింగ్‌పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకం!
సాక్షి, హైదరాబాద్(పోచారం): వేసవి కాలంలో పిల్లల కేరింతలతో స్విమ్మింగ్ పూల్స్ సందడిగా ఉంటాయి. నీళ్లలో ఈత కొట్టేందుకు పిల్లలు ఉరకలు వేస్తారు. పూల్‌లో కూల్ అవుతూ వేసవి తాపం నుంచి తప్పించుకుంటున్నారు. కానీ, పోచారం మున్సిపాలిటీలోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో చిన్నారులు తనువు చాలించిన సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. కొరవడిన అధికారిక పర్యవేక్షణ.. స్విమ్మింగ్ పూల్స్పై అధికారిక పర్యవేక్షణ లోపించడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపైనే స్విమ్మర్లు ఆధారపడాల్సి వస్తోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు మినహా నిర్వాహకులకు వేరే ఎలాంటి గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం జారీ చేయకపోవడంతో స్విమ్మింగ్ నేర్చుకునే వారికి వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ గణాంకాలు.. స్విమ్మింగ్ పూల్స్‌కు సంబంధించిన గణాంకాలు పోచారం మున్సిపల్ అధికారుల వద్ద లేవు. వీటిలో ఎలాంటి సదుపాయాలున్నాయో వీరు పరిశీలించరు. లైఫ్ గార్డులు, నీటి లోతు, తరచు నీటి మార్పిడి, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి అంశాలను గాలికి వదిలేస్తున్నారు. కోచ్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత లోపించిందనడానికి నిలువెత్తు నిదర్శనాలు. ఇటీవల బాలుడి మృతి.. ఇటీవల అన్నోజిగూడలోని స్విమ్మింగ్ పూల్‌లో 16 ఏళ్ల విద్యార్థి పూజారి పారికర్ మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందే. జిల్లా వ్యాప్తంగా 50కు పైగానే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గేటెడ్ కమ్యూనిటీలను కలుపుకొని గణాంకాలు తీస్తే సుమారు 50కు పైగానే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని అంచనా వేశారు. వీటిలో నిబంధనల ప్రకారం నిర్మితమైనవి పది కంటే మించవు. నీటి కొరత, ఇతరత్రా కారణాల వల్ల మరో 15 స్విమ్మింగ్ పూల్స్ మూతపడినట్లు తెలిసింది. పిల్లలకు ఇవి ఇవ్వడం మర్చిపోవద్దు.. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే ముందు పిల్లలకు కంటి అద్దాలు, చెవి ప్లగ్‌లు, ఫ్లోటర్లు, టవర్లు వంటి భద్రతా పరికరాలు ఇవ్వడం గుర్తుంచుకోవాలి. వీటితో నిర్భయంగా ఈత నేర్చుకోవచ్చు. అప్పుడే పిల్లలు సురక్షితంగా ఉంటారు. -
రూ. 6 కోట్లతో గ్రేటర్లో లగ్జరీ పూల్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో అధునాతన సదుపాయాలతో కూడిన లగ్జరీ స్విమ్మింగ్ పూల్ ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ లాలాపేట్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఈ పూల్ పనులు ప్రారంభమయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే ఇటు సాధారణ ప్రజలకు స్విమ్మింగ్ సదుపాయంతోపాటు, అటు జాతీయస్థాయి ఈత పోటీల్లో పాల్గొనేవారికీ ఉపయుక్తంగా ఉంటుంది. దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు సరిపడా స్విమ్మింగ్‌పూల్స్ లేవు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏడు ప్రాంతాల్లో మాత్రమే ఈత కొలనులు ఉన్నాయి. అవి అమీర్‌పేట, విజయనగర్‌కాలనీ, మొఘల్‌పురా, చందూలాల్ బారాదరి, సనత్‌నగర్, సికింద్రాబాద్, అంబర్‌పేటల్లో ఉన్నాయి. ప్రైవేటు స్విమ్మింగ్‌పూల్స్ అందరికీ అందుబాటులో లేవు. నగరంలో వివిధ సదుపాయాల కల్పనలో భాగంగా స్విమ్మింగ్‌పూల్స్‌పై సైతం దృష్టి సారించిన అధికారులు లాలాపేట్ స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. 2275 చదరపు మీటర్ల స్థలంలో 1050 చదరపు మీటర్ల మేర స్విమ్మింగ్‌పూల్ నిర్మించనున్నారు. ఈ పూల్ పెద్దల కోసం కాగా, చిన్నపిల్లలకు సైతం మరో పూల్ నిర్మించనున్నట్లు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు తీసిపోని విధంగా దీన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. పార్కింగ్తో పాటు వెయిటింగ్ లాబీ, తదితర సదుపాయాలుంటాయి. స్విమ్మింగ్‌పూల్ వివరాలు.. ప్రధాన స్విమ్మింగ్‌పూల్ విస్తీర్ణం : 1050 చ.మీ. పిల్లల స్విమ్మింగ్‌పూల్ విస్తీర్ణం : 40 చ.మీ. డాక్ ఏరియా : 930 చ.మీ. పార్కింగ్ ప్రదేశం : 400 చ.మీ. భవన విస్తీర్ణం : 246 చ.మీ. ఇందులో ప్రధాన పూల్ వైశాల్యం 50్ఠ21 మీటర్లు. లోతు 1.35 మీటర్ల నుంచి 2 మీటర్లు ఉంటుంది. పిల్లల పూల్ 5 ఇంటూ 8 మీటర్ల వైశాల్యంతో నిర్మిస్తారు. ప్రైవేట్ స్విమ్మింగ్‌పూల్స్‌తో పోలిస్తే, జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్స్ ఫీజులు చాలా తక్కువ. అర్హులైన కోచ్‌లు ఉంటారు. పోటీలకు హాజరయ్యే వారికి శిక్షణ సదుపాయాలు ఉంటాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో.. 12 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, 521 ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేసవిలో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ల పేరిట దాదాపు 1600 కేంద్రాల్లో బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణనిప్పిస్తున్నారు. శిక్షణనిచ్చే వారిలో జాతీయస్థాయి క్రీడాకారులు కూడా ఉంటారు. -
అందమైన స్విమ్మింగ్ పూల్స్ ఇవే!
న్యూఢిల్లీ : ప్రపంచంలో అందమైన ఈత కొలను(స్విమ్మింగ్ పూల్స్)ల గురించి తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పూల్స్ఆఫ్ఇన్స్టాగ్రామ్, పూల్స్ఆఫ్దివరల్డ్, పూల్లైఫ్, పూల్‌సైడ్’ హ్యాష్ ట్యాగ్‌లతో ఎన్నో సుందరమైన ఈత కొలనుల ఫొటోలను చూడవచ్చు. కాని అందులో అన్నీ మంచివేమి కాదు, ఎక్కువ కొలనులు సముద్రం నీటితో ఉప్పుగా ఉండి, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సాంద్రత ఎక్కువున్న నీటిలో ఎక్కువ సేపు ఈత కొట్టలేం. త్వరగా అలసిపోతాం. నీటి అడుగు భాగం కనిపించదు. నీటి గుండా దేన్నీ చూడలేం. ఇండోనేసియాలోని బాలి రెయిన్ ఫారెస్ట్‌లో ఉన్న త్రీ టైర్ ఈత కొలను, ఫ్రాన్స్‌లోని ఇబిజా నగరానికి బలియారిక్ సముద్ర తీరం వెంటనున్న ఈత కొలను, అమెరికాలోని హూబర్టస్లో ఆల్పిన్ మనోరమా హోటల్లో ఆరు అందమైన ఈత కొలనులు ఉన్నాయి. ఇటలీలోని దక్షిణ టిరోల్ పర్వత ప్రాంతంలో మీరామోంటి బోటిక్ హోటల్లో, స్విడ్జర్లాండ్లోని హోటల్ విల్లా హొనెగ్లో తీర్చినట్లుగా ఈత కొలనులు ఉన్నాయి. వీటిని చూస్తుంటే అబ్బా! జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఈత కొలనులో ఈత కొట్టాలనిపించకపోదు. వీటిలో ఈత కొడుతుంటే కొండల మధ్య సహజ సిద్ధమైన నదిలో ఈదుకుంటూ ప్రకృతి ఒడిలోకి జారిపోతున్నట్లు, ఈదుకుంటూ సముద్ర కెరటాల్లోకి వెళుతున్నట్లు, ఆకాశంలో తేలుతూ ఈత కొడుతుంటే కింద భూమి మీద అడవులు, కొండలు చూస్తున్నట్లు ఒక్కో దాంట్లో ఒక్కోరకమైన అనుభవం కలుగుతుంది. కొన్నింటిని సముద్ర తీరంలో నిర్మించగా, మరికొన్నింటిని నీటి సరస్సుల వద్ద, మరికొన్నింటిని అడవుల మధ్య నిర్మించారు. కొన్ని ఈత కొలనులకు అడుగు భాగాన అద్దాలుంటే చాలా కొలనులకు పక్క భాగాన అందాలుండి ప్రకృతిని ఆస్వాదించేందుకు తోడ్పడతున్నాయి. హూబర్టోస్లోని ఆల్ఫిన్ పనోరమా హోటల్లో 25 మీటర్ల పొడవైన ఈత కొలనులో కొంత అడుగు భాగం మొత్తం అద్దాలతోనే నిర్మించారు. అంటే ఆకాశంలో ఈత కొడుతూ భూమ్మీది అందాలను తిలకించవచ్చు. ఈ ఈత కొలనులన్నీ సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల నుంచి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. వీటిలో స్వచ్ఛమైన నీటిని నింపడమే కాకుండా ఎప్పుడూ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా వేడి నీటిని కూడా పంప్ చేస్తారు. -
ఏడాదిన్నరలో గృహప్రవేశం
సాక్షి, హైదరాబాద్: కనీసం మూడేళ్లయినా వేచి ఉండనిదే గృహ ప్రవేశం చేయని ఈ రోజుల్లో.. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసి, కొనుగోలుదారులకు అప్పగిస్తే? ప్రాజెక్ట్ విస్తీర్ణం చిన్నగా ఉన్నా.. వసతుల విషయంలో ఏమాత్రం తగ్గకపోతే? .. వీటన్నింటికీ ఒకటే సమాధానం చిన్న ప్రాజెక్ట్‌లు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజñ క్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. వసతులకు కొదవేంలేదు.. గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాకింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్‌లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్‌లో ఉండే కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
జలకాలాటలలో.. ప్రమాదపుబాటలలో..
రాయవరం (మండపేట), కాకినాడ రూరల్ : గతేడాది ఫిబ్రవరిలో అనపర్తిలోకాలువ స్నానానికి దిగి ఎనిమిదో తరగతి చదువుతున్న ఇరువురు విద్యార్థులు అసువులు బాశారు. అదే రోజు గొల్లప్రోలులో ఏలేరు కాలువలో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి పదో తరగతి బాలుడు మృతి చెందాడు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో స్నానానికి దిగి నాలుగేళ్లుగా సుమారు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ సరదాగా కాలువల్లోకి దిగిన వారే.. స్నానం చేద్దాం.. కాసేపు ఈత కొడదాం అన్నట్టుగా దిగి కాలువల్లో, నదుల్లో లోతు అంచనా తెలియక ప్రాణాలు కోల్పోయిన వారే. మండే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు చిన్నారులు, యువకులు కాలువలు, నదులు, సముద్రం, ఉప్పుటేర్లు, చెరువులు, రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులలో స్నానాలు చేసేందుకు ఈత కొట్టేందుకు ప్రాధాన్యమిస్తారు. నదులు, కాలువలు, చెరువుల్లో ఈత కోసం దిగి ఏటా జిల్లాలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ చర్యలు ప్రమాదం.. ♦ పలువురు చిన్నారులు కాలువల్లో స్నానాలు చేసే సమయంలో నలుగురిని చూసి కేరింతలు కొడుతూ ప్రమోదాలకు పోతున్నారు. ప్రమాదకర ఫీట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.∙ వేగంగా పరుగెత్తుకుని వచ్చి కాలువల్లో దూకడం, వంతెనలు, చెట్ల కొమ్మలపైకి ఎక్కి కాలువల్లో దూకడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ∙కాలువల లోతు అంచనా వేయలేని సమయంలోను, ఊబి ఉన్న చోట్ల దూకినప్పుడు, కాలువల్లో రాళ్లు, పదునైన..ప్రమాదకర వస్తువులు ఉన్నప్పుడు ప్రాణాపాయం సంభవించే పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పెద్దలు అప్రమత్తంగా ఉండాలి.. ♦ పిల్లల కదలికలపై పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. ♦ ‘పెద్దలు పిల్లల కదలికలు గమనిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించే వీలుంటుంది. ‘గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల తల్లిదండ్రులు ఎక్కువగా పనిపాటల్లోకి వెళ్తుంటారు. ♦ ఆ సమయంలో చిన్నారులు కాలువల వద్దకు వచ్చి ఈత సరదా తీర్చుకుంటున్నారు. పిల్లల ఈత సరదాను పెద్దల పర్యవేక్షణలో తీర్చుకుంటే కొంత వరకు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. ♦ కాలువల రేవుల వద్ద, చిన్నారులు ఎక్కువుగా స్నానాలు చేసే ప్రదేశంలో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పంచాయతీలు, ఇరిగేషన్ శాఖలు సంయక్తంగా కాలువ రేవుల వద్ద రక్షణగా ఐరన్ పోల్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆపద నుంచి ఇలా రక్షించవచ్చు.. ♦ రక్షించబోయే వ్యక్తికి ఈత రావడంతో పాటు ధైర్యం కలిగి ఉండాలి. ♦ నీటిలో మునుగుతున్న వ్యక్తి వెనుక నుంచి వెళ్లి అతడి వెంట్రుకలు, అండర్వేర్, మొలతాడు వంటి వాటిల్లో ఏదో ఒకటి పట్టుకుని ఒడ్డకు తీసుకురావాలి. ♦ ఈతకు వచ్చిన వారితో పాటు రాని వారు కూడా నీటిలో మునుగుతున్న వారిని రక్షించవచ్చు. నీటిలోకి దిగకుండా ఒడ్డు నుంచే దేన్నైనా పట్టుకునేలా అందించాలి. ♦ ♦ దగ్గరగా ఉంటే కర్ర, టవల్, ఫ్యాంట్ వంటివి, దూరంగా ఉంటే తాడు, పొడవాటి కర్రను అందించాలి. ప్రథమ చికిత్సఅత్యవసరం నీటిలో ప్రమాదానికి గురైన వ్యక్తిని ఒడ్డుకు చేర్చగానే అతడిని వెల్లకిలా పడుకోబెట్టాలి. అవసరమైతే నోట్లో నోరు పెట్టి శ్వాసను ఊడుతూ కృత్రిమ శ్వాస అందించాలి. ఛాతిపై చేతులతో ఒత్తాలి. దీంతో శ్వాస పెరుగుతుంది. ప్రథమ చికిత్స చేస్తూనే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యలకు చూపించాలి. తప్పక పాటించాల్సినవి.. ♦ కొలనుల్లో ఈత నేర్చుకునేందుకు వెళ్లేటప్పడు అక్కడ సుశిక్షతులైన కోచ్‌లు, ఇతర సిబ్బంది రక్షణ చర్యలు ఉన్నాయో లేదో పెద్దలు పరిశీలించాల్సిన తర్వాతే పిల్లలకు పంపించారు. ♦ సముద్రాలు, చెరువులు, కాల్వల్లో, ఈతకు వెళుతున్నప్పుడు బాలల వెంట పెద్ద వారు తప్పక వెళ్లాలి. ♦ కొత్త ప్రదేశంలో సముద్రం, చెరువులు, ఉప్పుటేర్లు, కాలువల్లో ఈత కొట్టే ముందు కర్రసాయంతో లోతును పరిశీలించాలి. ♦ ఈత రాని వారు దానిని నేర్చుకునేందుకు ట్యాబ్‌లు, ఇతర పరికరాలను ఉపయోగించి పూర్తిగా ఈత కొట్టడం వచ్చాకే లోతుకు వెళ్లాలి. ♦ మట్టిని లోతుగా తవ్విన ప్రాంతాల్లో నిలిచిన నీటిలో లోతు తెలియదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఈతకు సాహనం చేయరాదు. -
మహర్దశ
మహబూబ్‌నగర్ క్రీడలు : జిల్లా స్టేడియంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్‌కు మహర్దశ కలగనుంది. స్టేడియంలో ఆధునీకరణ పనుల కోసం రూ.2కోట్ల 50లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికే స్టేడియం మైదానంలో లేవలింగ్ పను లను ముమ్మరంగా చేపడుతున్నారు. దా దాపు రూ.70లక్షల నిధులతో స్విమ్మింగ్‌పూల్ ఆధునీకరణ చేపట్టనున్నారు. రెండు రోజుల నుంచి పూల్‌లో మరమ్మతులు పనులు జరుగుతున్నాయి. అన్ని సౌకర్యాలకు ప్రణాళికలు స్విమ్మింగ్‌పూల్‌లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి జిల్లా క్రీడాశాఖ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పూల్‌లోని స్నానపు, మూత్రలశాలలు గదుల మరమ్మతులు, ఫ్లోరింగ్, పాత జిమ్‌సెంటర్‌లో డీఎస్ఏ కార్యాలయం ఏర్పాటుతోపాటు బేబిపూల్, ఓపెన్ షవర్లు, పంప్‌రూం, భవన మరమ్మతులు చేపట్టనున్నారు. నూతనంగా స్టోర్ రూం నిర్మించనున్నారు. పూల్‌లో ఆధునీకరణ పనులు జరుగుతుండడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో అన్ని సౌకర్యాలు వేసవి సెలవుల్లో స్విమ్మింగ్‌పూల్‌కు అన్ని వయస్సుల వారు ఎక్కువగా వస్తారు. పూల్‌లో వారికి అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. వేసవి వచ్చేలోపు పూల్‌లో ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం. – టీవీఎల్ సత్యవాణి, డీవైఎస్ఓ -
మిలియనీర్ల గ్రామం!
ఆదర్శం: కరవు తాండమాడిన చోట కనకపు పళ్లేలలో భోజనం చేస్తున్నారు. చెంబు నీరు దొరకని చోట స్విమ్మింగ్ ఫూల్స్ వెలిశాయి. ఆకలి ఏడుపులు వినిపించిన చోట విందులు దినచర్య అయిపోయాయి. ఇది ఒక ప్రైవేటు ప్రాజెక్టు కాదు, ప్రభుత్వ చొరవ కూడా కాదు... ఒక వ్యక్తి తలంపు, ఒక ఊరి అభివృద్ధి. ఏ గ్రామానికి అయినా ఉనికి... నీరు, పాడి, పంట. ఈ మూడు లేకుంటే ఆ ఊరిలో తిండి దొరకదు. తొలుత జనం, ఆ తర్వాత ఊరు ఉనికిలేకుండా పోతాయి. ఇలాంటి పరిస్థితికి దగ్గరగా వెళ్లివచ్చిన గ్రామం హివ్రే బజార్(మహారాష్ట్ర). 1972లో తీవ్ర కరవు ఛాయలు మొదలైన ఆ ఊరు ఉపాధి లేక ఆకలికేకలతో అల్లాడింది. పంట లేదు, పని లేదు. జనంలో అసమానతలు భేదాభిప్రాయాలు పెరిగిపోయాయి. దొంగతనాలు, అల్లర్లు, మద్యపానం వంటివి పెచ్చరిల్లాయి. 1980ల చివరకు ఊరు దాదాపు ఖాళీ అయ్యింది. 90 శాతం మంది బతుకు తెరువును వెదుక్కుంటూ ఊరు వదిలేశారు. అప్పటికున్న ఊరి సర్పంచి వయసులో పెద్దాయన. పేరుకు సర్పంచి కానీ ఉపయోగం లేదు. అలాంటి సమయంలో ఆ ఊరిలో పీజీ చదువుకున్న ఏకైక వ్యక్తి పొపట్రావు పవార్‌కు మిత్రులు అందరూ నువ్వు సర్పంచిగా పోటీ చేయమని సలహా ఇచ్చారు. చేతనైన విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. పవార్‌కు ఆసక్తి లేదు. వాళ్లింట్లో వారికి ఇష్టం లేదు. నగరానికి పోయి ఉద్యోగం చేయాలని ఇంట్లోవాళ్లు, క్రికెటర్ కావాలని పవార్ ఆలోచించేవాడు. కానీ మిత్రులు నిరంతరం పోరే సరికి ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. తనకిష్టం లేకున్నా పోటీ చేసి గెలిచాడు. కానీ గెలిచాక మాత్రం అదొక అద్భుతమైన అవకాశంగా అనిపించింది. పేదరికానికి నిలయమైన ఆ ఊరిలో 22 బెల్టుషాపులు, సారా దుకాణాలుండేవి. అసలు గొడవలన్నీ వాటివల్లే. వాటిని తొలగించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ర్టతో మాట్లాడి గ్రామంలో ఉపాధి కోసం స్వల్పకాలిక రుణాలు మంజూరుకు చర్చలు జరిపి విజయం సాధించాడు. తీవ్ర కరవుతో అల్లాడిన ఆ గ్రామంలో పొపట్రావు మొదలుపెట్టిన మొదటి అభివృద్ధి పని వర్షపు నీటి యాజమాన్యం. ఊరి పొలిమేరలో కురిసిన ఒక్క చుక్క కూడా వృథా కాకుండా ఆ ఊరిలో ఎక్కడ పల్లముంటే అక్కడ వర్షపు నీటి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించాడు. అలాంటివి 52 భారీ ఇంకుడు గుంతలు తవ్వించాడు. గుట్టల నుంచి వచ్చే నీరు వృథా కాకుండా రాతి గట్లు నిర్మించాడు. వర్షాకాలపు కాలువలు పారే చోట తొమ్మిది చెక్‌డ్యాములు కట్టించాడు. వీటికి అవసరమైన డబ్బును ప్రభుత్వం వెంటపడి మరీ సంపాదించాడు సర్పంచ్ పొపట్రావు. ఇవన్నీ నిర్మించడం పూర్తయ్యాక ఏడాది కాలంలోనే సాగు పొలం 20 హెక్టార్ల నుంచి 70 హెక్టార్లకు పెరిగింది. నీటి నిల్వ కారణంగా భూగర్భజలాలు విపరీతంగా పెరగడంతో బోర్లలో నీరు పైకి వచ్చాయి. దానివల్ల అనేకరకాల పంటలు పెట్టే అవకాశం వచ్చింది. ఇపుడు 40 అడుగుల లోపే కావల్సినన్ని నీళ్లు. హివ్రే బజార్ ఇపుడు అహ్మద్‌నగర్ జిల్లాలోనే సస్యశ్యామలంగా ఉండే గ్రామం. నీటితో పాటు సిరులు 90 శాతం స్థానికులు ఖాళీ అయిన హివ్రేబజార్లో నీళ్లు వచ్చాక వలసపోయిన జనం సొంతూరికి తిరిగి రావడం మొదలుపెట్టారు. 1995లో ఆ ఊరి తలసరి ఆదాయం 830 రూపాయలు. ఇపుడు అది 30,000 రూపాయలు. 1995లో ఆ ఊరిలో 170 పేద కుటుంబాలుంటే వాటిలో 165 కుటుంబాలు బీపీఎల్ కిందున్నవే. ఇపుడు 255 కుటుంబాలుంటే కేవలం 3 కుటుంబాలే పేదవి. మిగతా వారిలో 60 మంది మిలియనీర్లు. దేశంలో అత్యధిక మిలియనీర్లున్న ఏకైక గ్రామమిది. జనాభా ప్రాతిపదికన అత్యధిక కార్లున్న గ్రామం కూడా ఇదే. దీనికంతటికీ కారణం ఆ గ్రామం చేసుకున్న వర్షపు నీటి నిర్వహణ. ఆ ఊరిలో పడిన ప్రతి చుక్క వాననీరు భూమిలోకైనా ఇంకాలి, పొలంలో అయినా పారాలి. వరితో నీరు వృథా చేయకుండా మొక్కజొన్న, జొన్న, సజ్జలు, ఉల్లిగడ్డలు, పొటాటోలు వంటి వేర్వేరు పంటలు శాస్త్రీయంగా, తక్కువ మందులతో పండించారు. అలా సస్యశ్యామలమైన ఈ ఊరు ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మారింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాటర్‌షెడ్ ఇన్స్టిట్యూషన్ను పెట్టింది. ఇలా ఆ ఊరిలో ప్రతిఒక్కరికి తమ స్థాయికి ఉపాధి, ఉద్యోగం లభించాయి. ఊరి నుంచి ప్రతిరోజు 4000 లీటర్ల పాలు ఎగుమతి చేస్తున్నారు. ఇలా క్రమం తప్పని వ్యవసాయం, ఉపాధి పనులతో మిలయనీర్లయ్యారు.