జలయజ్ఞంతో ‘ఇందూరు’ సస్యశ్యామలం | ysr schemes in front of peoples | Sakshi
Sakshi News home page

జలయజ్ఞంతో ‘ఇందూరు’ సస్యశ్యామలం

Published Wed, Apr 9 2014 3:25 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

ysr schemes in front of peoples

 నిజాంసాగర్, న్యూస్‌లైన్ : జలయజ్ఞం ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువ  ఆధునికీకరణ పనుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  459 కోట్లు మంజూరు చేసి ఇందూరు జిల్లాను సస్యశ్యామలం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా సమన్వయకర్త నాయుడు ప్రకాశ్ అన్నా రు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ప్రధాన కాలువ శిథిలావస్థకు చేరుకొని, ఆయకట్టు పంటలకు నీరందక బీడువారిన భూములను సాగులోకి తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌కు దక్కిందన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు 14 వరద గేట్ల ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక ఆలయం, వైఎస్‌ఆర్ ఆవిష్కరించి న పైలన్‌కు ఆయన ప్రత్యేక పూజలు చే శారు.

 ఈ సందర్భంగా  విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ నిజాంసాగర్  ప్రధాన కాలువ పనుల కోసం ఇక్కడే పైలాన్ ఆవిష్కరించారన్నారు. అందుకోసం వైఎస్‌ఆర్ తనయుడు  స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జుక్కల్ అసెంబ్లీ స్థానానికి తాను పోటీలో ఉన్నానని, ఇందులోభాగంగా నామినేషన్ వేస్తున్నందున పైలాన్,  స్థానిక సి ద్ధివినాయక ఆలయంలో పూజలు చేసినట్లు చెప్పారు.  సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ పథకాలను ప్రజల ముం దుకు తీసుకువెళ్తున్నామన్నారు. బడుగు బలహీన వ ర్గాలు, రైతులు, మహిళల కోసం వైఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వాటన్నింటిని లబ్ధిపొందిన ప్రజలు వైఎస్సార్‌సీపీని ఆదరిస్తారన్నారు.  రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజల్లోకి వెళ్లి వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు.  సమావే శంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నాయకులు నీరడి లక్ష్మణ్, శ్రీధర్,యాసిన్, గోరెబాయ్, శాంతికుమార్, విఠల్‌రెడ్డి, మహేశ్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement