naidu prakash
-
వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడిగా నాయుడు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుడిగా నాయుడు ప్రకాశ్ నియమితులయ్యారు. సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి సీఈసీ సభ్యునిగా నాయుడు ప్రకాశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తనపై పార్టీ పెద్దలు ఉంచిన నమ్మకానికి నాయుడు ప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
తెలంగాణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు
ఒక్క అవకాశమిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి పార్టీ అభ్యర్థి నాయుడుప్రకాష్ నిజాంసాగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని జుక్కల్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి నాయుడుప్రకాష్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం పెద్దకొడప్గల్ గ్రామం నుంచి నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఆయన పాల్గొని మా ట్లాడారు. రైతుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో మేలు చేశారని అన్నారు. ఆయన హయాం లో ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఏర్పాటైందని అన్నారు. వైఎస్ఆర్ మరణానంతరం కాం గ్రెస్ ప్రభుత్వం పథకాలను నీరుగార్చిందన్నారు. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందకపోవడంతో పాటు 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలపై నిర్లక్ష్యం వహిం చిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందన్నారు. తెలంగాణ వాదానికి కట్టుబడి పనిచేసిన ఉద్యమకారులకు, నా యకులకు టీఆర్ఎస్ అధినేత టికెట్లు కేటాయించలేదని అన్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకొని కుటుంబ సభ్యులను రాజకీయాల్లో అందలం ఎక్కించడానికి తపన పడుతున్నారని ఆరోపించారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్, ప్రస్తుతం ఆ హామీని విస్మరించి సీఎం కుర్చీ కోసం ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తనకు ఒక్క అవకాశమి స్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నీరడి లక్ష్మణ్, ఇస్మాయిల్, గోరెబాయి, కాశిరాం, శాంతికుమార్ తదితరులు ఉన్నారు. -
జలయజ్ఞంతో ‘ఇందూరు’ సస్యశ్యామలం
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : జలయజ్ఞం ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 459 కోట్లు మంజూరు చేసి ఇందూరు జిల్లాను సస్యశ్యామలం చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా సమన్వయకర్త నాయుడు ప్రకాశ్ అన్నా రు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ప్రధాన కాలువ శిథిలావస్థకు చేరుకొని, ఆయకట్టు పంటలకు నీరందక బీడువారిన భూములను సాగులోకి తెచ్చిన ఘనత వైఎస్ఆర్కు దక్కిందన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు 14 వరద గేట్ల ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక ఆలయం, వైఎస్ఆర్ ఆవిష్కరించి న పైలన్‌కు ఆయన ప్రత్యేక పూజలు చే శారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నిజాంసాగర్ ప్రధాన కాలువ పనుల కోసం ఇక్కడే పైలాన్ ఆవిష్కరించారన్నారు. అందుకోసం వైఎస్ఆర్ తనయుడు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జుక్కల్ అసెంబ్లీ స్థానానికి తాను పోటీలో ఉన్నానని, ఇందులోభాగంగా నామినేషన్ వేస్తున్నందున పైలాన్, స్థానిక సి ద్ధివినాయక ఆలయంలో పూజలు చేసినట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పథకాలను ప్రజల ముం దుకు తీసుకువెళ్తున్నామన్నారు. బడుగు బలహీన వ ర్గాలు, రైతులు, మహిళల కోసం వైఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వాటన్నింటిని లబ్ధిపొందిన ప్రజలు వైఎస్సార్సీపీని ఆదరిస్తారన్నారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజల్లోకి వెళ్లి వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. సమావే శంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు నీరడి లక్ష్మణ్, శ్రీధర్,యాసిన్, గోరెబాయ్, శాంతికుమార్, విఠల్‌రెడ్డి, మహేశ్ తదితరులున్నారు. -
ప్రచారానికి తెర నేటితో...
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీతో పాటు ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. మిగిలిన ఒక్కరోజును స ద్వి నియోగం చేసుకునేందుకు పార్టీలు వ్యూహరచ న చేస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్‌అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీ మధుయాష్కీ, డీసీసీ అధ్యక్షు డు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు ప్రచారం లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఇన్చార్జులు ఎ.జీవన్‌రెడ్డి, తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు కె.కవిత అభ్యర్థులతో ప్రచారం చేపట్టారు. ఉద్ధండుల పర్యటన వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకులు నాయుడు ప్రకాశ్, జిల్లా నాయకులు అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సింగిరెడ్డి రవీందర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్ రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ, జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్ తదిరులు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ కార్పొరేష న్ ప్రచార బాధ్యతలను మీదేసుకున్నారు. పార్టీ నాయకులు పల్లె గంగారెడ్డి, గడ్డం ఆనందరెడ్డి తదితరులు అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు ప్ర చారంలో మునిగారు. అధికారులు రెడీ మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 3న నోటిఫికేషన్ వెలువడగా, పోలింగు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం మొత్తం 1,056 మంది కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ పార్టీల లనుంచి బరిలో నిలిచారు. నిజామాబాద్‌లో 50 డివిజన్లకు 414 మంది వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో 33 వార్డులకు 184 మంది, ఆర్మూరులో 23 వార్డులకు 141 మంది, బోధన్‌లో 35 వార్డులకు 317 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 18తో నామినేషన్ల పరిశీలన ఉపసంహరణలు పూర్తయి, గుర్తుల కేటాయింపు జరగ్గా 19 నుంచి ప్రచారాన్ని అభ్యర్థులు చేపట్టారు. శుక్రవారంతో ప్రచారం ముగియనుండటంతో ఆయా పార్టీల ముఖ్యనేతలతో నాలుగు రోజులుగా మరింత ఉధృతం చేశారు. 30న పోలింగు జరగనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల సీనియర్ నేతలు రంగంలోకి దిగడంతో ప్రచారం హోరెత్తింది. ప్రలోభాలకు రంగం సిద్ధం కార్పొరేషన్:ప్రచారం ఘట్టం ముగియడంతోనే పోలింగ్‌కు ముందు మిగిలే చివరి రెండు రోజుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం పంపిణీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల గుట్టు చప్పుడుకాకుండా మద్యం, డబ్బు పంపిణీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు ఉదయం టిఫిన్,మధ్యాహం భోజనం, రాత్రి విందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదంటున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న డివిజన్లు,వార్డులలో ఈ జోరు కనిపిస్తోంది. కొన్ని వార్డుల్లో మహిళలకు,మహిళ సంఘాలకు చీరలు, విలువైన కానుకలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అభ్యర్థులో పాటు పార్టీల నేతలు మండుటెండలను లెక్కచేయకుండా ఇం టింటికి వెళ్లి ఓటర్లను బతిమిలాడారు. మున్సిపల్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కొన్ని రాజ కీయ పక్షాలు, అభ్యర్థులు కొనసాగుతున్నారు. ఈవీఎంలు రెడీ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈ పాటికే పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎంలను సీజ్ చేసి జిల్లా కేంద్రం లోని నిర్మల హృదయ హైస్కూల్లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. ఈ నెల పోలింగ్‌కు ఒకరోజు ముందు 29న సాయంత్రం వాటిని బూత్ లెవల్ స్థాయి అధికారులకు అందజేస్తారు. వారు ఈవీఎంలను తీసుకుని అదే రోజు రాత్రికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లవలసి ఉంటుంది. -
రాజన్న పథకాలే గెలిపిస్తాయి
వైఎస్ఆర్ సీపీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి నాయుడు ప్రకాష్ మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత శివాజీనగర్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెటిన సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట్టీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి నాయుడు ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని పార్ట్టీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయుడు ప్రకాష్ మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమించారని, జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు అయ న హయాంలోనే పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ప్రతి నిరుపేదకు పిం ఛన్, రేషన్‌కార్డు, గృహ నిర్మాణాలు అందించి వైఎస్సార్ వారి గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు తనకు అప్పగించారని, కార్యకర్తలతో కలిసి గట్టి కృషితో ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబడతామన్నారు. ఈ నెల 30న జరుగనున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు ఏప్రిల్‌లో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలబడతారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ లేదని కొంత మంది దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రతి ఇంటిలో రాజశేఖరరెడ్డి అభిమానులు ఉన్నారన్నారు. పార్టీ అర్బన్ ఇన్చార్జి ఇస్మాయిల్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో తమ పార్టీ పోటీచేస్తుందని పేర్కొన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ తిరుగులేని మెజార్టీ సాధిం చుకొని అధికారం చేజిక్కించుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరపున నిజామాబాద్ నగర పాలక సంస్థలో పోటీ చేస్తున్న గైనికాడి విజయలక్ష్మీ , పంతుకల కృష్ణ, నవీన్‌శర్మ, ఇమ్రాన్, నాగుల ప్రమోద్‌లకు బీ-ఫారాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయలక్ష్మి, నీరడి లక్ష్మన్, ప్రసాద్, సాయిరాం, బొడ్డు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.