వైఎస్‌ఆర్ సీపీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి నాయుడు ప్రకాష్
మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత
శివాజీనగర్, న్యూస్‌లైన్:
దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెటిన సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్ట్టీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి నాయుడు ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని పార్ట్టీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయుడు ప్రకాష్ మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమించారని, జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు అయ న హయాంలోనే పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ప్రతి నిరుపేదకు పిం ఛన్, రేషన్‌కార్డు, గృహ నిర్మాణాలు అందించి వైఎస్సార్ వారి గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్తామన్నారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నమ్మకంతో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలు తనకు అప్పగించారని, కార్యకర్తలతో కలిసి గట్టి కృషితో ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబడతామన్నారు. ఈ నెల 30న జరుగనున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు ఏప్రిల్‌లో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలబడతారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ లేదని కొంత మంది దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రతి ఇంటిలో రాజశేఖరరెడ్డి అభిమానులు ఉన్నారన్నారు. పార్టీ అర్బన్ ఇన్‌చార్జి ఇస్మాయిల్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో తమ పార్టీ పోటీచేస్తుందని పేర్కొన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ తిరుగులేని మెజార్టీ సాధిం చుకొని అధికారం చేజిక్కించుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరపున నిజామాబాద్ నగర పాలక సంస్థలో పోటీ చేస్తున్న గైనికాడి విజయలక్ష్మీ , పంతుకల కృష్ణ, నవీన్‌శర్మ, ఇమ్రాన్, నాగుల ప్రమోద్‌లకు బీ-ఫారాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయలక్ష్మి, నీరడి లక్ష్మన్, ప్రసాద్, సాయిరాం, బొడ్డు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజన్న పథకాలే గెలిపిస్తాయి
Published Wed, Mar 12 2014 1:00 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement
Advertisement