- ఒక్క అవకాశమిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి
- పార్టీ అభ్యర్థి నాయుడుప్రకాష్
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని జుక్కల్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి నాయుడుప్రకాష్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం పెద్దకొడప్‌గల్ గ్రామం నుంచి నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఆయన పాల్గొని మా ట్లాడారు. రైతుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో మేలు చేశారని అన్నారు. ఆయన హయాం లో ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఏర్పాటైందని అన్నారు. వైఎస్‌ఆర్ మరణానంతరం కాం గ్రెస్ ప్రభుత్వం పథకాలను నీరుగార్చిందన్నారు.
పేదలకు ప్రభుత్వ ఫలాలు అందకపోవడంతో పాటు 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలపై నిర్లక్ష్యం వహిం చిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందన్నారు. తెలంగాణ వాదానికి కట్టుబడి పనిచేసిన ఉద్యమకారులకు, నా యకులకు టీఆర్‌ఎస్ అధినేత టికెట్లు కేటాయించలేదని అన్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకొని కుటుంబ సభ్యులను రాజకీయాల్లో అందలం ఎక్కించడానికి తపన పడుతున్నారని ఆరోపించారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్, ప్రస్తుతం ఆ హామీని విస్మరించి సీఎం కుర్చీ కోసం ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తనకు ఒక్క అవకాశమి స్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నీరడి లక్ష్మణ్, ఇస్మాయిల్, గోరెబాయి, కాశిరాం, శాంతికుమార్ తదితరులు ఉన్నారు.