తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అమలు: వైఎస్ జగన్ | We will implement Welfare Schemes in Telangana too: YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అమలు: వైఎస్ జగన్

Published Sun, Apr 27 2014 12:05 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అమలు: వైఎస్ జగన్ - Sakshi

తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అమలు: వైఎస్ జగన్

ఖమ్మం: సీమాంధ్రలో అమలు చేసే కార్యక్రమాలను తెలంగాణలోనూ అమలు చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
 
వైఎస్ఆర్ సీపీ జనభేరి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలయ్యేలా బాధ్యత తీసుకుంటాను అని అన్నారు. 
 
తెలంగాణ ప్రాంతంలోనూ బలమైన శక్తిగా ఉంటామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగానికి భారీ స్పందన లభించింది. 
 
ఖమ్మం జిల్లాలో వైఎస్ జగన్ జనభేరి సత్తుపల్లి నుంచి ప్రారంభమైంది.  వైఎస్ జగన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ అసెంబ్లీ అభ్యర్ధులు,  కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement