ఇదిగో నవలోకం
ఏటా జిల్లాకు 90 వేల పక్కా ఇళ్లు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: వచ్చే ఐదేళ్లలో రాష్ర్టంలో ఏటా సుమారు 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామని వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతో వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన శ్రీకాకుళానికి ఏటా 90 వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. మరోవైపు పెరిగిన ముడిసరుకు ధరలకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని పెంచనున్నారు. దీంతో జిల్లాలోని రేకు, పూరిళ్లన్నీ స్లాబ్‌లుగా మారనున్నాయి. పేదలకు ఇంటి కల నెరవేరనుంది.
నిరు పేదలందరికీ పక్కాఇళ్లు
పేదవారికందరికీ పక్కాఇంటి సౌకర్యం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇళ్ల నిర్మాణానికి కృషి చేశారు. జగన్‌కూడా అదేబాటలో పయనిస్తున్నారు. పేదలకు పక్కా ఇంటి కల నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నారు.
-పేడాడ సీతారాం,
కొత్తపేట, ఎచ్చెర్ల మండలం
జిల్లాకో కార్పొరేట్ ఆస్పత్రి
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్: జగన్ మేనిఫెస్టోతో ప్రజల ఆరోగ్యానికి భరోసా కలిగింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏప్రిల్ 1, 2007లో అమలుచేసిన ఆరోగ్యశ్రీ పథకంతో లక్షల మంది పేదల కుటుంబాల్లో వెలుగులు ప్రసరించారుు. పేద గుండెకు ధైర్యం వచ్చింది. 942 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి పేద గుండెలకు ధైర్యం కల్పించారు. ఆయన మరణానంతరం 133 వ్యాధులను పథకం నుంచి తొలగించి పేదల ఆరోగ్యానికి భద్రతలేకుండా చేశారు. వైద్యం అందిచండంలో జాప్యం చేయడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నారుు. తండ్రి ఆశయూలను అందిపుచ్చుకున్న జగన్‌మోహన్ రెడ్డి ఆరోగ్యభద్రతకు వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పెద్ద పీట వేశారు. ఆరోగ్యశ్రీ పథకం పటిష్టతతో పాటు జిల్లాకో కార్పొరేట్ ఆస్పత్రిని నిర్మించి దానికి ఆరోగ్యశ్రీని అనుసంధానం చేస్తామని ప్రకటించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి విశ్రాంతిలో ఉండాల్సి వస్తే నెలకు రూ.3 వేలు చొప్పున అందజేస్తామని స్పష్టం చేశారు.
జిల్లాలో 2.7లక్షల మందికి వరం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినవెంటనే అమలు చేయనున్న ఉచిత విద్యుత్ పథకంతో 2.7 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం జిల్లాలో 6.90 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2.7 లక్షల మంది 150 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగిస్తున్నారు. వీరంతా పథకంతో లబ్ధిపొందుతారు. మరో 70వేల మంది వరకు 200 యూనిట్ల వరకు వినియోగిస్తున్నారు. వీరుకూడా విద్యుత్ పొదుపు పాటిస్తే రూ.100కే విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన 3.2 లక్షల మందికి లబ్ది చేకూరే వీలుంటుంది. ప్రస్తుతం కనీస విద్యుత్ బిల్లు రూ. 130 గా ఉంది. 150 యూనిట్లు వరకు వినియోగించిన వారికి రూ. 450 బిల్లు వస్తుంది. కొత్త పథకంతో బిల్లు కష్టాలు తీరుతారుు. రూ.350 మిగులుతుంది. అలాగే, వ్యవసాయ మోటార్లకు 9 గంటల పాటు నిరంతరాయంగా ఉదయంపూటే విద్యుత్ సరఫరా చేయడం వల్ల జిల్లాలో 28 వేలు వ్యవసాయ కనెక్షన్లకు లబ్ధికలగనుంది. వ్యవసాయం లాభదాయం కానుంది.
4 లక్షల మందికి లబ్ధి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: డ్వాక్రా రుణాల రద్దుతో జిల్లాలో సుమారు 4 లక్షల మంది డ్వాక్రా మహిళలు లబ్ధిపొందనున్నారు. జిల్లాలో 42,350 మహిళా స్వయం శక్తి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో సుమారు 4,65,850 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 36,450 సంఘాలు వివిధ బ్యాంకుల నుంచి లింకేజీలు (రుణాలు) పొందారు. ఇంతవరకు పెండింగ్‌లో ఉన్న రుణాలు సుమారు రూ.547 కోట్లు ఉన్నాయి. ఈ రుణాలు మాఫీవల్ల జిల్లాలోని స్వయంశక్తి సంఘాలకు చెందిన 4 లక్షలమందికి పైగా మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది.
రుణమాఫీ చాలా అవసరం
రుణం ఇచ్చిన రోజు నుంచే బ్యాంకుకు వాయిదాలు పద్ధతితో డబ్బులు కట్టాలి. మా దగ్గర డబ్బులు లేక మరుసటి రోజు కట్టినా వడ్డీ పడిపోతుంది. పూర్తి వడ్డీ రాయితీ వర్తించడం లేదు. నాడు రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పావలా వడ్డీ కొంత బాగుండేది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు తీర్చడం కష్టంగా మారింది. జగన్ అధికారంలోకి వస్తే కష్టాలన్నీ తీరిపోతాయి.
-పెయ్యల సూరమ్మ,
జల్లువలస, గార
1600 బెల్టు దుకాణాల మూత
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: పల్లెప్రజల జీవన ప్రమాణాలను, కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మద్య నియంత్రణకు వైఎస్సార్ సీపీ పూనుకుంది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు దుకాణాలు నిర్మూలిస్తామని పేర్కొంది. జిల్లాలో 17 బార్లు, 232 మద్యం దుకాణాలకు లెసైన్‌స ఉంది. ప్రస్తుతం జిల్లాలో 16 బార్లు, 203 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటికి అనుబంధంగా సుమారు 1600 బెల్ట్ దుకాణాలు ఉన్నాయి. అందుబాటులో మద్యం దొరుకుతుండడంతో పెద్దవారు, యువకులు వ్యసనానికి బానిసవుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. దీంతో బెల్టు దుకాణాలు ఎత్తివేతకు వైఎస్సార్ సీపీ పక్కా ప్రణాళిక రూపొందించింది. ప్రతి మండలానికి ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను నియమించనుంది. వీరు నిత్యం గ్రామాల్లో తిరుగుతూ బెల్టు దుకాణాల నియంత్రణకు పాటుపడతారు. పల్లెల్లో శాంతి భద్రతలను పరిరక్షిస్తారు. మహిళలకు అండగా నిలబడతారు.
పేదల కుటుంబాలు బాగుపడతాయి
వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో బెల్టు దుకాణాల మూసివేత అంశం మంచిది. బెల్ట్ దుకాణాల వల్ల చాలా పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీటిని ఎత్తి వేస్తే గ్రామాల్లో పేదవారి కుటుంబాలు బాగుపడతాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు కేవలం బెల్టు దుకాణాలు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చారే తప్ప అమలుచేయలేదు. -బి.సుమలత, గృహిణి
పల్లెలు ప్రశాంతంగా ఉంటాయి
బెల్టు దుకాణాలతో పల్లెల్లో వ్యసన పరులు రోజురోజుకూ పెరుగుతున్నారు. యువకులు కూడా మద్యానికి బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా అవతరిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. మహిళల కష్టాలను, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నిలిపేం దుకు జగన్‌మోహన్‌రెడ్డి కృషి అభినందనీయం. మండలానికి ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను కేవలం బెల్ట్ దుకాణాల మూసివేతకే నియమిస్తామని పేర్కొనడం హర్షణీయం. పేద మహిళల కనీటి బాధను అర్ధం చేసుకున్న నాయకుడిగా జగన్ పేరుపొందారు.
-చక్రం, కిరాణా వ్యాపారి
పేదలకు ప్రయోజనం
రూ.100కే 150 యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయడం వల్ల లబ్ధికలుగుతుంది. పేదలకు ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు మాకు రూ.150లు వరకు బిల్లు వస్తుంది. ఇది కట్టడం చాలా కష్టంగా ఉంది. రాజశేఖర్‌రెడ్డి కాలంలో విద్యుత్ చార్జీలు ఎప్పుడూ పెరగలేదు. ఆయన చనిపోయిన తరువాత ఐదుసార్లు పెంచారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ బిల్లుల కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చారు.
- బేబీ, శ్రీకాకుళం
విద్యుత్ పొదుపునకు అవకాశం
ఈ పథకం వల్ల విద్యుత్ పొదుపునకు అవకాశం కలుగుతుంది. ఎక్కువ బిల్లులు వచ్చేవారంతా విద్యుత్ పొదుపు చేసి రూ.100కే 150 యూనిట్లు విద్యుత్ పథకాన్ని వినియోగించుకుంటారు. మాకు ప్రస్తుతం రూ.500లు వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. వాడకం తగ్గిం చుకుంటే విద్యుత్ పథకం కిందకు వస్తాం.
- ఎ.సునీత, శ్రీకాకుళం