అర్హులందరికీ సంక్షేమ పథకాలు
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమ త్స సాంబశివరాజు అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఆది వారం ఆయన నెల్లిమర్ల నగర పంచాయతీలోని గాంధీనగర్ కాలనీ, సెగిడివీధి, సెగిడిపేట, మొయిన్ రోడ్డు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మోహన్‌రెడ్డి ఐదు అంశాలపై సంతాకలు చేస్తారన్నారు. అందులో మొదటి సం తకం ‘అమ్మఒడి’ ఫైలుపై పెడతారని, దీని వల్ల ఏ త ల్లీ పిల్లల చదువు కోసం భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం ద్వారా పిల్లలకు బంగారు భవి ష్య త్తు అందుతుందన్నారు.అలాగే వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల పెంపు, రైతుల కోసం స్థిరీకరణ నిధి, పల్లెల్లోనే ప్రభుత్వ కార్యాలయూల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
పార్టీ అభ్యర్థి సురేష్‌బాబు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు, పింఛన్లు అందజేయడంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. పార్టీ నాయకుడు చన మ ల్లు వెంకటరమణ మాట్లాడుతూ నెల్లిమర్లలోని చాలా మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సింగుబాబు, కేవీ సూ ర్యనారాయణరాజు (పులిరాజు), జనా ప్రసాద్, అంబళ్ల అప్పలనాయుడు, మావూరి శంకరరావు, పెనుమత్స అప్పలరాజు, ఇడదీసి శ్రీనివాసరావు, మహంతి అప్పలనాయుడు, సంచాన శ్రీనివాసరావు, రేగాన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.