ఏ కార్డయినా 24 గంటల్లోనే... | ysr congress party Welfare schemes | Sakshi
Sakshi News home page

ఏ కార్డయినా 24 గంటల్లోనే...

Published Wed, Apr 30 2014 1:31 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ఏ కార్డయినా 24 గంటల్లోనే... - Sakshi

ఏ కార్డయినా 24 గంటల్లోనే...

 సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక ఎత్తయితే వాటిని ప్రజల దరిచేర్చడం మరో ఎత్తు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలం నిజంగా ప్రజలకు అందితే అంతకంటే సువర్ణపాలన మరొకటి ఉండదు. లేదంటే ఎన్ని కోట్లు వెచ్చించినా ప్రయోజనం ఉండదు. మహానేత రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రేషన్ కార్డుకి...వివిధ ధ్రువపత్రాల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి కష్టాలు రాజన్న రాజ్యంలో ఉండరాదని భావించిన మహానేత తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ‘పల్లెల్లోకే పాలన’పై నాలుగో సంతకం చేయనున్నారు. రేషన్ కార్డులు, పెన్షన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, పక్కా ఇంటి కార్డు ఇలా అన్ని కార్డులు, పత్రాలు 24 గంటల్లో జారీ చేసే విధంగా ప్రతి గ్రామంలో, వార్డులో ప్రత్యేక ఆఫీసు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
 
 ఆ సంతకం ఫలితం ఇదీ...
 జగన్ నాలుగో సంతకం చేసిన ఈ పథకం అమల్లోకి
 వస్తే ప్రతి గ్రామంలో జనసేవా కార్యక్రమాలు ఉంటాయి.
 రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛను కార్డులు, ఇలా ఇతర పథకాలకు సంబంధించిన మంజూరు పత్రాలు అర్హులైన లబ్ధి దారులకు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో వారికి సదరు పత్రాలు అందజేస్తారు.
 
   అందిన దరఖాస్తులు తక్షణం పరిశీలించి
 విచారించేందుకు సేవా కేంద్రాల్లో ప్రత్యేక ప్రభుత్వ యంత్రాంగం
 పనిచేస్తుంది.    సేవా కేంద్రాలు ఓప్రభుత్వ కార్యాలయాల్లా
 పనిచేస్తాయి.
 
     {పతి దరఖాస్తును పారదర్శకతతో
     పరిశీలిస్తారు. అర్హమైనవని గుర్తించిన
     వెంటనే అధికారులు వారికి లబ్ధి అందజేసేందుకు
     ఆదేశాలు జారీ చేస్తాను.
       సంబంధిత విభాగాధిపతులు వాటిని
     లబ్ధిదారులకు సమాచారం అందించి
     అందజేస్తారు.
 
   వైఎస్ జగన్ నాలుగో సంతకం ‘పల్లెల్లోకే పాలన’పైనే    సమర్థ పాలనకు నిదర్శనం
 పేరుకు పోతున్న దరఖాస్తులుకాంగ్రెస్ పాలనలో కిరణ్‌కుమార్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు సార్లు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వీటిలో స్వీకరించిన దరఖాస్తులకు ఏళ్లు గడిచినా మోక్షం లభించడం లేదు. మొదటి రచ్చబండ దరఖాస్తులకు రెండో దశలో, రెండోదశలో స్వీకరించిన వాటికి మూడో దశలో మోక్షం కల్పించారు. ఆశతో అర్జీ పెట్టుకున్న వారిలో 40 శాతం కూడా లబ్ధి పొందలేకపోయారు. మూడు రచ్చబండ కార్యక్రమాల్లో పక్కా ఇళ్ల కోసం సుమారు 1.10 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా వాటిలో వేల సంఖ్యలో కూడా ఇళ్లు మంజూరు చేయలేక పోయారు.
 
 అలాగే రేష న్ కార్డుల కోసం 2012లో దరఖాస్తు చేసుకున్న వారికి కూపన్లు ఇచ్చి కాలం గడిపారు. జిల్లాలో 73 వేల మంది అర్హులకు 2013లో కూపన్ల 66వేల పంపిణీ జరిగింది. ఇందులో సగంమందికి కూడా 2013 నవంబరులో జరిగిన మూడో విడత రచ్చబండలో కార్డుల జారీ జరగలేదు. ఇంక మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 28 వేల మంది నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు ఇప్పటికి ఒక్క కొత్త కార్డు కూడా ఇవ్వలేదు. ఇంక పెన్షన్ల దరఖాస్తులు వేలల్లో పెండింగ్ ఉన్నాయి వీటి వివరాలపై అధికారులకు కూడా స్పష్టత లేదు. ఇక ఇతర సేవల విషయానికి వస్తే మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో ప్రజల సేవలు పరిష్కరించేందుకు నిర్ణీత గడువు విధిస్తూ సిటిజన్ ఛార్టర్లు ప్రదర్శిస్తున్నారు. అయితే ఆ ప్రకారం సర్టిఫికెట్లు సర్వీసులు అందుబాటులో ఉండడంలేదంటున్నారు వినియోగ దారులు.
 
 పునర్జన్మనిచ్చారు...!
 మాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమీనాబాద. నాపేరు రాచపల్లి సత్యనారాయణ. వేట సాగితేనే పూట గడిచేది. ఉన్నంతలో నేను నా భార్య బంగారమ్మ సంతృప్తిగా జీవిస్తున్నాం. మాకు ఒక పండంటి పాప (అమూల్య ) జన్మించింది. పుట్టినప్పటినుంచి ఏదో లోపంతో ఉన్నట్టు అనుమానం రావడంతో మేము పాపను డాక్టర్‌కి చూపించాం. పరీక్ష చేసిన తర్వాత మాపాప గుండెకు రంధ్రం ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో మాకు గుండె ఆగినంత పనైంది. అప్పుడే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ మాకు అండగా నిలిచింది. స్థానిక వైద్యసిబ్బంది మావద్దకు వచ్చి పాపకు కాకినాడ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అక్కడినుంచి హైదరాబాద్ తీసుకువెళ్లి నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. మందులు కూడా ఇచ్చారు. 2008లో ఆపరేషన్ జరిగింది. ఇపుడు మా పాపకి ఏడో సంవత్సరం. పూర్తి ఆరోగ్యంతో ఆమె ఉందంటే అది వైఎస్సార్ చలవే. ఆ దేవుడు నాకు బిడ్డను ప్రసాదిస్తే ఈ దేవుడు (వైఎస్సార్) ఆమెకు పునర్జన్మ ఇచ్చారు. అందుకే ఆయనను దేవుడిగా పూజించుకుంటున్నాం.  
 
 బతుకు నిలిపారు.. ప్రాణం పోశారు
 మాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి. నాపేరు పినిశెట్టి వెంకటరామారావు. భార్య ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి పేపర్‌బాయ్‌గా పనిచేస్తూ, కూలిపనికి వెళుతూ ఎంతో కష్టపడేవాణ్ని. సొంతంగా వ్యాపారం చేసుకుందామని బ్యాంకు అధికారులను లోన్ కోసం ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో పులివెందులలో  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిగారిని కలసి నా గోడు చెప్పుకుంటే ఆయన వెంటనే రుణం మంజూరు చేసేలా అక్కడినుంచే ఆదేశాలు ఇచ్చారు. దాంతో నాకు లోన్ వచ్చింది. ఆ డబ్బుతో బజ్జీల బండి పెట్టుకుని జీవనం సాగిస్తుండగా 2008లో ఉన్నట్టుండి నా ఆరోగ్యం క్షీణించింది. పనిచేయలేని పరిస్థితి రావడంతో ఆస్పత్రికి వెళ్లాను. పరీక్షలు చేసి గుండె సంబంధ వ్యాధిగా నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. నా దుస్థితికి ఇంటిల్లపాదీ రోదిస్తున్న సమయంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది వైద్య పరీక్షలు, శస్త్రచికిత్స చేయించారు. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే నా కుటుంబం వీధిన పడేది. ఈ పథకంతో నాలాంటి ఎందరికో పునర్జన్మనిచ్చిన వైఎస్సార్ కనిపించే దేవుడు. ఆయనకు నమస్కారంతోనే మా దినచర్య మొదలవుతుంది.
 
 తిరగలేక చస్తున్నాం
 రేషన్ కార్డు కావాలంటే తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. సర్టిఫికెట్లకు దరఖాస్తు చేస్తే ఎప్పుడిస్తారో చెప్పలేం. సంక్షేమ పథకాలంటున్నారు.. కానీ అవి మాకు అందడంలేదు. ప్రతి పంచాయతీ పరిధిలో జన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి, 24 గంటల్లో ఏకార్డయినా జారీ చేసే సౌకర్యం కల్పిస్తే అందరికీ మేలు జరుగుతుంది.
 - బచ్చలి కన్నయమ్మ,  పనసలపాలెంపంచాయతీ,
  రాచపాలెంగ్రామం, వై.రామవరం మండలం.
 
 నిజంగా వరమే
 ప్రతి గ్రామంలో కంప్యూటర్‌తో కార్యాలయం ఏర్పాటుచేసి రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, కుల,ఆదాయ ధ్రువీకరణపత్రాలు 24 గంటల్లో మంజూరు చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం చాలా గొప్ప విషయం. రేషన్‌కార్డు, విద్యార్థుల సర్టిఫికెట్ల కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
 -  ముదునూరి రామరాజు,అయినాపురం, ముమ్మిడివరం మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement