సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ, బీజేపీతో పాటు ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. మిగిలిన ఒక్కరోజును స ద్వి నియోగం చేసుకునేందుకు పార్టీలు వ్యూహరచ న చేస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్‌అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీ మధుయాష్కీ, డీసీసీ అధ్యక్షు డు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు ప్రచారం లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ నుంచి నిజామాబాద్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఇన్‌చార్జులు ఎ.జీవన్‌రెడ్డి, తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు కె.కవిత అభ్యర్థులతో ప్రచారం చేపట్టారు.
ఉద్ధండుల పర్యటన
వైఎస్‌ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకులు నాయుడు ప్రకాశ్, జిల్లా నాయకులు అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సింగిరెడ్డి రవీందర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్ రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ, జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్ తదిరులు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ కార్పొరేష న్ ప్రచార బాధ్యతలను మీదేసుకున్నారు. పార్టీ నాయకులు పల్లె గంగారెడ్డి, గడ్డం ఆనందరెడ్డి తదితరులు అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, బీఎస్‌పీ తదితర పార్టీల అభ్యర్థులు ప్ర చారంలో మునిగారు.
అధికారులు రెడీ
మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 3న నోటిఫికేషన్ వెలువడగా, పోలింగు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం మొత్తం 1,056 మంది కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ పార్టీల లనుంచి బరిలో నిలిచారు. నిజామాబాద్‌లో 50 డివిజన్లకు 414 మంది వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో 33 వార్డులకు 184 మంది, ఆర్మూరులో 23 వార్డులకు 141 మంది, బోధన్‌లో 35 వార్డులకు 317 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 18తో నామినేషన్ల పరిశీలన ఉపసంహరణలు పూర్తయి, గుర్తుల కేటాయింపు జరగ్గా 19 నుంచి ప్రచారాన్ని అభ్యర్థులు చేపట్టారు. శుక్రవారంతో ప్రచారం ముగియనుండటంతో ఆయా పార్టీల ముఖ్యనేతలతో నాలుగు రోజులుగా మరింత ఉధృతం చేశారు. 30న పోలింగు జరగనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల సీనియర్ నేతలు రంగంలోకి దిగడంతో ప్రచారం హోరెత్తింది.
ప్రలోభాలకు రంగం సిద్ధం
కార్పొరేషన్:ప్రచారం ఘట్టం ముగియడంతోనే పోలింగ్‌కు ముందు మిగిలే చివరి రెండు రోజుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం పంపిణీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని చోట్ల గుట్టు చప్పుడుకాకుండా మద్యం, డబ్బు పంపిణీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు ఉదయం టిఫిన్,మధ్యాహం భోజనం, రాత్రి విందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదంటున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న డివిజన్లు,వార్డులలో ఈ జోరు కనిపిస్తోంది. కొన్ని వార్డుల్లో మహిళలకు,మహిళ సంఘాలకు చీరలు, విలువైన కానుకలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అభ్యర్థులో పాటు పార్టీల నేతలు మండుటెండలను లెక్కచేయకుండా ఇం టింటికి వెళ్లి ఓటర్లను బతిమిలాడారు. మున్సిపల్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కొన్ని రాజ కీయ పక్షాలు, అభ్యర్థులు కొనసాగుతున్నారు.
ఈవీఎంలు రెడీ
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈ పాటికే పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎంలను సీజ్ చేసి జిల్లా కేంద్రం లోని నిర్మల హృదయ హైస్కూల్‌లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. ఈ నెల పోలింగ్‌కు ఒకరోజు ముందు 29న సాయంత్రం వాటిని బూత్ లెవల్ స్థాయి అధికారులకు అందజేస్తారు. వారు ఈవీఎంలను తీసుకుని అదే రోజు రాత్రికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లవలసి ఉంటుంది.
ప్రచారానికి తెర నేటితో...
Published Fri, Mar 28 2014 2:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement