నైజీరియా : నైజీరియా ఒగన్ రాష్ట్రంలోని లాగోస్ - లబ్డన్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మరణించారని నైజీరియా రోడ్డు కమిషన్ శనివారం వెల్లడించింది. రెండు ట్రక్కులు, మరో రెండు వాహనాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుందని పేర్కొంది.
నైజీరియాలో రహదారులు పూర్తి అధ్వానంగా ఉంటాయి. వాటికి పట్టించుకునే నాధుడు కూడా ఉండరు. దీనితోపాటు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించరు. ఈ నేపథ్యంలో నైజీరియాలో రోడ్డు ప్రమాదాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.
రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
Published Sat, Aug 1 2015 11:45 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement