
అమెరికా గజగజ
ఉత్తర అమెరికాలోని మాంట్రియల్ నగరంలో గడ్డకట్టిన సెయింట్ లారెన్స్ నది. భారీ మంచు తుపాను, విపరీతమైన చలిగాలుల ధాటికి ఈశాన్య అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. గడ్డ కట్టించే చలిగాలుల దెబ్బకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్‌తోపాటు బోస్టన్, ఫిలడెల్ఫియాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. న్యూయార్క్ నగరంలో ఆరు అంగుళాల మేర మంచు పేరుకుపోయింది.