రోడ్డు ప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతి
లాగోస్: నైజీరియాలోని ఒగన్ రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న బస్సు ట్రక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారని ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. మృతుల్లో విద్యార్థులతోపాటు డ్రైవర్ కూడా ఉన్నాడని తెలిపారు. మృతులు స్థానిక యూనివర్శిటీ విద్యార్థులని చెప్పారు. ట్రక్ డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడపి... ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. దాంతో బస్సులోని వారంతా అక్కడికక్కడే మరణించారని చెప్పారు.