లఖ్వీకి ఎదురుదెబ్బ
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ జకీమర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడికి ఇస్లామాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసును తిరిగి ఇస్లామాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. సావధానంగా వాదనలు వినాలని హైకోర్టును ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈనెల 12కు హైకోర్టు వాయిదా వేసిందని జియో టీవీ వెల్లడించింది.
డిసెంబర్ 18న తీవ్రవాద వ్యతిరేక కోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేసింది. తర్వాతి రోజు ఎంపీఓ చట్టం ప్రకారం అతడిని నిర్భందంలోకి తీసుకున్నారు. అయితే దీన్ని ఇస్లామాబాద్ కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును పాకిస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.