ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఖైబర్ఫక్త్ ప్రావిన్స్‌లోని అబోటాబాద్ సమీపంలో భూకంపం సంభవించింది. దీంతో భవనం కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్పారు. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదయిందని తెలిపారు. ఇస్లామాబాద్‌కి 23 కిలోమీటర్ల దూరంలో మర్గల్లా పర్వతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించారు.