రోడ్డు ప్రమాదం: 30 మంది దుర్మరణం | 30 dead in Nigeria road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: 30 మంది దుర్మరణం

Published Tue, Jul 7 2015 8:33 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదం: 30 మంది దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదం: 30 మంది దుర్మరణం

అబూజా: నైజీరియా కొగీ రాష్ట్రంలోని లొకొజా - అబూజా జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది అక్కడికక్కడే మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.

అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనే విషయాన్ని మాత్రం ఫెడరల్ రోడ్డు సేఫ్టీ కమిషన్ తెలపాల్సి ఉంది. లావోస్ నగరం నుంచి రాజధాని అబూజాకు బస్సు  వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement