
టెల్కోలపై రూ. 50 లక్షల వరకూ ట్రాయ్ జరిమానా
టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ 9 టెలికాం కంపెనీలపై రూ. 50 లక్షల జరిమానాను వడ్డించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలానికి ప్రమాణాలకు తగ్గట్లుగా నాణ్యమైన టెలికాం సర్వీసులనందజేయనందుకు ట్రాయ్ ఈ జరిమానా విధించిందని అధికార వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ 9 టెలికాం కంపెనీలపై రూ. 50 లక్షల జరిమానాను వడ్డించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలానికి ప్రమాణాలకు తగ్గట్లుగా నాణ్యమైన టెలికాం సర్వీసులనందజేయనందుకు ట్రాయ్ ఈ జరిమానా విధించిందని అధికార వర్గాలు తెలిపాయి. అధిక మొత్తం జరిమానా(రూ.14.5 లక్షలు)ను బీఎస్‌ఎన్‌ఎల్‌పై ట్రాయ్ విధించింది. వీడియోకాన్, లూప్ మొబైల్, ఎంటీఎన్‌ఎల్‌లపై ఎలాంటి జరిమానా లేదు. ఎయిర్‌సెల్, ఆర్‌కామ్‌లపై చెరో రూ.12.5 లక్షలు, ఐడియా సెల్యులర్(రూ.3 లక్షలు), భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై చెరో రూ.2 లక్షలు, ఎంటీఎస్‌పై రూ.50,000 వరకూ ట్రాయ్ జరిమానాలు విధించింది.