ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి | 7 killed, 25 injured in car-bus collision | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

Published Tue, Feb 25 2014 2:42 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

7 killed, 25 injured in car-bus collision

మధ్యప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెరైన - అంబ జాతీయ రహదారిపై బర్హగాం సమీపంలో మాజీ కార్పోరేటర్ కారు ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనలో 25 మంది గాయపడ్డారని తెలిపారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

 

మాజీ కార్పొరేటర్ కుటుంబం కారులో పోర్సాలోని బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం  చోటు చేసుకుందన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలతోపాటు బస్సులోని ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించారన్నారు. మృత దేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement