car-bus collision
-
కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా?
సాక్షి, వికారాబాద్(యాలాల): బైకును వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పాతకక్షల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే బైకును కారుతో ఢీకొట్టి హత్య చేశారని క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన తాండూరు పట్టణంలో యాలాల ఠాణా పరిధిలోకి వచ్చే రాజీవ్ కాలనీ వద్ద శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. రాజీవ్ కాలనీకి చెందిన జబ్బార్(35)ఆటో డ్రైవర్. శనివారం రాత్రి 11 గంటలకు అతడు అదే కాలనీకి చెందిన సూఫియాన్, సోహైల్‌తో కలిసి బైక్‌పై తాండూరు నుంచి కాలనీ వైపు వస్తున్నాడు. చదండి: కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా.. ఈక్రమంలో కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో జబ్బార్ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సూఫియాన్, సొహైల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సూఫియాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు హైదరాబాద్ తీసుకెళ్లారు. చదవండి: ఒడిశా: రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారం కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం! ఈ ఘటనను మొదట స్థానికులు ప్రమాదంగా భావించారు. కారు ఢీకొన్న తర్వాత అందులోని వ్యక్తులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సూఫియాన్.. పాతకక్షల నేపథ్యంలో ఇస్మాయిల్, మోహిన్ అనే వ్యక్తులు కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. అనంతరం యాలాల పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్‌సీఐ జలంధర్‌రెడ్డి వివరాలు సేకరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడు జబ్బార్‌కు భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, కారు
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులోని గాడుదుల గండి గుట్ట వద్ద మంథని-కాటారం ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళుతున్న పరకాల డిపో బస్ ఏపీ 36జెడ్ 0161 మంథని వైపుకు వస్తున్న కారు టీఎస్ 04ఎఫ్ సీ 9774ను ఢీ కొట్టి బస్ లోయలో పడిపోయింది. దీంతో కారు డ్రైవర్ తాటి వినీత్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 12మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులను మంథని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. వీరిలో ఒక వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉంది. మంథని మండలం ఖాన్ సాయిపేట్ గ్రామానికి చెందిన మృతుడు వినీత్ మంథనిలో కార్ కేర్ సెంటర్లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కారు డ్రైవర్ తాటి వినీత్ మంత్రి విచారం లోయలో పడిన బస్సు దుర్ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ రీజినల్ మేనేజర్లకు మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు కావల్సిన వైద్య సేవల కోసం సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గాయాలకు గురైన ప్రయాణీకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధిత కుటుంబసభ్యులకు తమ విచారం వ్యక్తం చేశారు. -
ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెరైన - అంబ జాతీయ రహదారిపై బర్హగాం సమీపంలో మాజీ కార్పోరేటర్ కారు ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనలో 25 మంది గాయపడ్డారని తెలిపారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మాజీ కార్పొరేటర్ కుటుంబం కారులో పోర్సాలోని బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలతోపాటు బస్సులోని ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించారన్నారు. మృత దేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.