లండన్లో బ్రిటిష్ యువతి ముఖం మీద గట్టిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన 80 ఏళ్ల సిక్కు వృద్ధుడు మరణించారు. కోవెంట్రీ నగరంలో ఆగస్టు నెలలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. అక్కడి ట్రినిటీ స్ట్రీట్లో ఆగస్టు పదో తేదీన జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన జోగీందర్ సింగ్ను తర్వాత ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసిన తర్వాత కూడా మళ్లీ అనారోగ్యం పాలు కావడంతో మరోసారి ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. అయితే.. ఆయన ఇటీవలే మరణించినట్లు వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు తెలిపారు.
బ్రిటిష్ యువతి కోరల్ మిల్లర్చిప్ (19) జోగీందర్ర సింగ్పై దాడి చేస్తున్న సంఘటనను ఎవరో మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో ఆ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆమె తీవ్రంగా కొట్టి కింద పారేయడంతో ఆయన తలపాగా కూడా పడిపోయింది. కిందపడిన జోగీందర్పై ఆమె ఉమ్మేసినట్లు కూడా వీడియోలో ఉంది. అనంతరం ఆమె కొంతమంది యువకులతో కలిసి వెళ్లిపోయింది. జోగీందర్ సింగ్ మృతికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోడానికి పోస్టుమార్టం చేశారు. ఈ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఆమె కొట్టడం వల్లే చనిపోయారా లేదా అన్న విషయం నిర్ధారణ అయితే తప్ప తదుపరి చర్యలు తీసుకోలేమని పోలీసులు అంటున్నారు.
బ్రిటిష్ యువతి దాడిలో 80 ఏళ్ల సిక్కు వృద్ధుడి మృతి
Published Thu, Nov 7 2013 8:25 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement