లండన్: ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్.. మరో వివాదానికి కేంద్రబిందువైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ ఇటీవల రద్దు చేసుకోవడం తెలిసిందే. అయితే పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన ఖలిస్థాన్ తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు 1984లో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో భారత్‌కు నాటి బ్రిటన్ ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు రావడం వెనుక అగస్టా కంపెనీకి అప్పట్లో హెలికాప్టర్ల ఒప్పందం దక్కేలా చూసే యోచన ఉందన్న అనుమానాలు తాజాగా వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై బ్రిటన్ ప్రతిపక్షం లేబర్ పార్టీ ఎంపీ వాట్సన్ బుధవారం ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో ప్రధాని కామెరాన్‌ను ప్రశ్నించారు. రక్షణ ఒప్పందాలతో ‘అమృత్‌సర్ వ్యవహారానికి’ సంబంధం లేదని కామెరాన్ చెప్పారు.