Amritsar Golden Temple
-
స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ నినాదాలు
అమృత్సర్: పంజాబ్‌లో సిక్కుల ప్రధాన దేవాలయమైన గోల్డెన్ టెంపుల్లో ఆదివారం ఖలిస్తాన్ నినాదాలు వినిపించాయి. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భాగంగా గోల్డెన్‌టెంపుల్‌లో నక్కిన ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు 37 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఖలిస్తాన్ మద్దతు నినాదాలు వినిపించాయి. ఇందులో నినాదాలు చేసిన వారు శిరోమణి అకాలీదళ్ (మన్)కు చెందిన వారు కావడం గమనార్హం. జనవరి 26న రైతుల ట్రాక్టర్ మార్చ్‌లో జరిగిన హింసకు బాధ్యుడని భావిస్తున్న దీప్ సిద్దూ.. మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్ సింగ్ మన్తో కలసి ఈ సమావేశంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ సందర్భంగా జతేదార్ హర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ బ్లూ స్టార్ గాయాలను సిక్కు వర్గం ఇంకా మర్చిపోలేదన్నారు. -
మరో ప్రేమ ప్రయాణం!
పబ్లిక్‌గా ప్రేమను ఒప్పుకోలేదు కానీ వీలు చిక్కినప్పుడల్లా ప్రేమపక్షుల మాదిరి విహరిస్తున్నారు హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్. అవసరమనుకుంటే ఫారిన్ ట్రిప్‌కి కూడా వెళ్తున్నారు. మొన్నా మధ్య అమెరికాలో ఈ ఇద్దరూ సందడి చేశారు. తాజాగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లి కొంత సమయాన్ని గడిపారు నయన్ అండ్ విఘ్నేష్. యాక్చువల్లీ నయనతార ఎప్పుడు అమృత్సర్ వెళ్లినా ఒంటరిగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు జంటగా వెళ్లడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్. అంటే వీరి పెళ్లికి శుభఘడియలు దగ్గర పడుతున్నాయా? అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ఇద్దరూ అక్కడ ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో వాటిల్లో ఒకటి. ఇక సినిమాల విషయానికి వస్తే... తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’, తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నారు నయనతార. ఈ సినిమాలు కాకుండా మరో రెండు తమిళ ప్రాజెక్ట్స్‌తో ఎప్పటిలాగానే ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నారీ లేడీ సూపర్‌స్టార్. -
బంగారు గుడిని దర్శించిన నయన్
తమిళసినిమా: డబ్బు, పేరు, పరపతి ఇలా ఎన్ని ఉన్నా మనిషికి కావలసింది అంతకు మించి ఒకటుంటుంది. అదే మనశ్శాంతి. దాన్ని ఒక్కొక్కరు ఒక్కో చోట పొందుతుంటారు. నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మక చింతనతో హిమాలయాల బాట పడుతుంటారు. మరి కొందరు భక్తిభావంతో ఆలయాలను సందర్శిస్తారు. ఇటీవల నయనతారలో కూడా భక్తి భావం పెరిగింది. తరచూ గుళ్లు, గోపురాలు చుట్టోస్తున్నారు. ప్రేమ కోసం ఒకసారి మతం మార్చుకోవడానికి సిద్ధపడిన ఈ కేరళా భామ ఆ ప్రేమ ఫలించకపోవడంతో మళ్లీ యథావిధిగా అసలు మతాన్నే పాటిస్తున్నారు. ఇటీవల పంజాబ్ రాష్టం, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను నయన్ సందర్శించడం చర్చకు దారి తీస్తోంది. అగ్రనటిగా కొనసాగుతున్న ఈ బ్యూటీ నటిగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నయన్ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగానే హల్చల్ చేస్తోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సారైనా తన ప్రేమను పెళ్లి పీటలెక్కించాలని కోరుకుని దైవదర్శనం చేసుకుని ఉంటారనే ప్రచారం జరుగుతోంది. నయనతార నల్లని సల్వర్ ధరించి, నెత్తిపై అదే రంగు షాల్‌ను వేసుకుని చిరుదరహాసంతో గోల్డెన్ టెంపుల్ వద్ద దిగిన ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
వీడని ‘బ్లూస్టార్’ నీడ
అమృత్‌సర్‌లోని స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి మూడు దశాబ్దాలు దాటుతున్నా కాంగ్రెస్‌పై ఆ మచ్చ పోలేదు. సైనికుల్ని పంపి గుళ్ల వర్షం కురిపించి నెత్తురొలికించిన ఆనాటి ఉదంతంపై సోనియా ఒక టికి రెండు సార్లు విచారం వ్యక్తం చేసినా ఫలితం లేదు. బ్రిటన్ కన్సర్వేటివ్ పార్టీ కూడా దాన్నుంచి తప్పించుకోలేకపోతోంది. ఆదివారం నుంచి మూడు రోజుల పర్యటనకు భారత్ వస్తున్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆ ఉదంతంపై వివరణనివ్వాలని లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బ్లూస్టార్‌లో బ్రిటన్ ప్రమే యాన్ని రుజువు చేసే ఫైళ్లు మాయం అయ్యాయని అక్కడి సిక్కులు చేస్తున్న ఆరోపణలకు సంజాయిషీ ఇవ్వాలని కోరుతోంది. తమ ప్రభుత్వం అప్పట్లో సలహా మాత్రమే ఇచ్చింది తప్ప సాయం చేయలేదని కన్సర్వే టివ్‌లు చెబుతున్న మాటల్ని ఎవరూ నమ్మడం లేదు. -
‘బ్లూస్టార్’కు సాయంపై అగస్టాతో లింకు!
లండన్: ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్.. మరో వివాదానికి కేంద్రబిందువైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ ఇటీవల రద్దు చేసుకోవడం తెలిసిందే. అయితే పంజాబ్‌లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన ఖలిస్థాన్ తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు 1984లో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో భారత్‌కు నాటి బ్రిటన్ ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు రావడం వెనుక అగస్టా కంపెనీకి అప్పట్లో హెలికాప్టర్ల ఒప్పందం దక్కేలా చూసే యోచన ఉందన్న అనుమానాలు తాజాగా వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై బ్రిటన్ ప్రతిపక్షం లేబర్ పార్టీ ఎంపీ వాట్సన్ బుధవారం ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో ప్రధాని కామెరాన్‌ను ప్రశ్నించారు. రక్షణ ఒప్పందాలతో ‘అమృత్సర్ వ్యవహారానికి’ సంబంధం లేదని కామెరాన్ చెప్పారు.