
నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్
పబ్లిక్‌గా ప్రేమను ఒప్పుకోలేదు కానీ వీలు చిక్కినప్పుడల్లా ప్రేమపక్షుల మాదిరి విహరిస్తున్నారు హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్. అవసరమనుకుంటే ఫారిన్ ట్రిప్‌కి కూడా వెళ్తున్నారు. మొన్నా మధ్య అమెరికాలో ఈ ఇద్దరూ సందడి చేశారు. తాజాగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లి కొంత సమయాన్ని గడిపారు నయన్ అండ్ విఘ్నేష్. యాక్చువల్లీ నయనతార ఎప్పుడు అమృత్‌సర్ వెళ్లినా ఒంటరిగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు జంటగా వెళ్లడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్.
అంటే వీరి పెళ్లికి శుభఘడియలు దగ్గర పడుతున్నాయా? అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ఇద్దరూ అక్కడ ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో వాటిల్లో ఒకటి. ఇక సినిమాల విషయానికి వస్తే... తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’, తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నారు నయనతార. ఈ సినిమాలు కాకుండా మరో రెండు తమిళ ప్రాజెక్ట్స్‌తో ఎప్పటిలాగానే ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నారీ లేడీ సూపర్‌స్టార్.
Comments
Please login to add a commentAdd a comment