అమృత్‌సర్‌లోని స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి మూడు దశాబ్దాలు దాటుతున్నా కాంగ్రెస్‌పై ఆ మచ్చ పోలేదు. సైనికుల్ని పంపి గుళ్ల వర్షం కురిపించి నెత్తురొలికించిన ఆనాటి ఉదంతంపై సోనియా ఒక టికి రెండు సార్లు విచారం వ్యక్తం చేసినా ఫలితం లేదు. బ్రిటన్ కన్సర్వేటివ్ పార్టీ కూడా దాన్నుంచి తప్పించుకోలేకపోతోంది. ఆదివారం నుంచి మూడు రోజుల పర్యటనకు భారత్ వస్తున్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆ ఉదంతంపై వివరణనివ్వాలని లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బ్లూస్టార్‌లో బ్రిటన్ ప్రమే యాన్ని రుజువు చేసే ఫైళ్లు మాయం అయ్యాయని అక్కడి సిక్కులు చేస్తున్న ఆరోపణలకు సంజాయిషీ ఇవ్వాలని కోరుతోంది. తమ ప్రభుత్వం అప్పట్లో సలహా మాత్రమే ఇచ్చింది తప్ప సాయం చేయలేదని కన్సర్వే టివ్‌లు చెబుతున్న మాటల్ని ఎవరూ నమ్మడం లేదు.