
ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్:‘బై నౌ-ఫ్లై నౌ’
న్యూఢిల్లీ: ఎయిర్‌ఏసియా విమాన ప్రయాణికులకు బంపర్‌ఆఫర్ ప్రకటించింది. ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ తదితర ఎయిర్ లైన్స్‌తో పోటీ పడుతున్న నేపథ్యంలో ఎయిర్ ఆసియా ఇండియా సోమవారం సరికొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బై నౌ.. ఫ్లై నౌ’ పేరుతో లాంచ్ చేసిన ఈ ఆఫర్‌లో ఎంపిక చేసిన రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు అందించనుంది. ఇందులో ప్రారంభ ధర రూ.1,031లుగా నిర్ణయించింది. మే 21 వరకూ అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 4, 2017లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను ఎయిర్‌ఏషియా అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ కోసం ముందస్తు బుకింగ్ అవసరమని పేర్కొంది.
ఎయిర్ ఏషియా ఇండియా వెబ్‌సైట్ ఆధారంగా ఈ ప్రోత్సాహక పథకంలో కొన్ని ప్రత్యేక ఛార్జీలు ఇలా ఉన్నాయి.
గోవా-హైదరాబాద్‌కు రూ. 1,237
హైదరాబాద్ నుండి గోవా కు రూ .1,722
గోవా-బెంగళూరు రూ .1,428,
జైపూర్-పూణే రూ. 2.908,
న్యూ ఢిల్లీ-బెంగళూరు రూ. 1,927,
పూణే-బెంగళూరు రూ. 1,758,
విశాఖపట్నం-బెంగళూరు రూ. 1,640 మరియు
బెంగళూరు-హైదరాబాద్ రూ. 1,565
ఢిల్లీనుంచి ఇతర ప్రాంతాలకు ఛార్జీలు
బెంగళూరు రూ. 1927.00
గౌహతి రూ.3765.00
గోవా రూ. 3364.00
బాగ్డోగ్రా రూ .2565.00
రాంచి రూ. 2924.00
పూణే రూ. 3364.00
శ్రీనగర్ రూపాయలు 2062.00
ఇంఫాల్ రూ 4364.00
కోల్‌కతా రూ.2697.00
ఇతర నిబంధనలు:
* క్రెడిట్, డెబిట్ లేదా ఇతర కార్డులపై ప్రాసెసింగ్ ఫీజులు తిరిగి చెల్లించబడవు.
* అన్ని విమానాలలోను సీట్స్ అందుబాటులో ఉండవు
* క్రొత్త టికెట్ కొనుగోలులో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
* ఈ ఆఫర్ వన్-వన్ ట్రిప్ కు మాత్రమే
* ఒకసారి చెల్లింపు చేసిన తర్వాత, వాపసు చేయబడదు.