విమానంలో మంటలు.. 15 మందికి గాయాలు | Airplane fire at Florida airport injures 15 | Sakshi
Sakshi News home page

విమానంలో మంటలు.. 15 మందికి గాయాలు

Published Fri, Oct 30 2015 8:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

విమానంలో మంటలు.. 15 మందికి గాయాలు

విమానంలో మంటలు.. 15 మందికి గాయాలు

మియామి: అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో  రన్వేపై విమానంలో మంటలు చెలరేగడంతో 15 మంది గాయపడ్డారు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసి ప్రయాణికులను విమానంలో నుంచి కిందకు దించారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

గురువారం బోయింగ్ 767 విమానం వెనిజులాకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో 101 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వేపై విమానంలోని ఓ ఇంజిన్లో మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై విచారించేందుకు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఓ బృందాన్ని పంపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement