దారితప్పిన వాహన విక్రయాలు | all motors bussiness is full down | Sakshi
Sakshi News home page

దారితప్పిన వాహన విక్రయాలు

Published Mon, Dec 2 2013 12:41 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

దారితప్పిన వాహన విక్రయాలు - Sakshi

దారితప్పిన వాహన విక్రయాలు


 న్యూఢిల్లీ: వాహన అమ్మకాలు అంతకంతకూ తగ్గుతున్నాయి. పండుగల పుణ్యమాని అక్టోబర్‌లో ఒక మోస్తరుగా ఉన్న వాహన విక్రయాలు నవంబర్‌లో తగ్గాయి.
 టాటా మోటార్స్ అమ్మకాలు 39%, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 18%, వీఈ కమర్షియల్ వెహికల్స్ విక్రయాలు 37% చొప్పున తగ్గాయి. టయోటా అమ్మకాలు 12%, మహీంద్రా ట్రాక్టర్స్ విక్రయాలు 13 శాతం చొప్పున పెరిగాయి. నవంబర్‌లో టాటా మోటార్స్ అమ్మకాలు 39% తగ్గాయి. ఇది దాదాపు మూడేళ్ల కనిష్టం. గత ఏడాది నవంబర్‌లో 62,354గా ఉన్న టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో 40% క్షీణించి 37,192కు తగ్గాయి. ఎగుమతులు 4,146 నుంచి 3,671కు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎగుమతులు 116% పెరిగినప్పటికీ, దేశీయ అమ్మకాలు మాత్రం 22%, త్రీ వీలర్ల అమ్మకాలు 15% తగ్గాయి. మహీంద్రా ట్రాక్టర్స్ దేశీయ అమ్మకాలు 13%, ఎగుమతులు 8% చొప్పున పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement