అమెజాన్ క్రిస్మస్ బంపర్ ఆఫర్లివే!
అమెజాన్ క్రిస్మస్ బంపర్ ఆఫర్లివే!
Published Tue, Dec 20 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
న్యూఢిల్లీ : మోటోరోలా అభిమానులకు అమెజాన్ బంపర్ ఆఫర్లు తీసుకొచ్చింది. మోటోరోలా మోటో జీ4, మోటో జీ4 ప్లస్, మోటో జీ4 ప్లే ఫోన్లపై భారీ డిస్కౌంట్లను తమ ఫ్లాట్ ఫామ్ పై ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ వెబ్సైట్ ప్రకటించింది. ఈ మోడల్స్ను కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్ ధరపై రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది.
మోటో జీ4 ప్లస్ ఫోన్:
32 జీబీ వేరియంట్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.14,999లు కాగ ఫ్లాట్పై రూ.1000 డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.13,999కే అమెజాన్లో లభించనుంది. అదేవిధంగా 16జీబీ వేరయంట్ ఫోన్ కూడా రూ.12,499కే లభించనుందని వెల్లడించింది.
మోటో జీ4 ఫోన్:
మోటో జీ 4వ తరం ఫోన్పై రూ.2,000 డిస్కౌంట్ను అమెజాన్ అందుబాటులో ఉంచింది. రూ.13,999 ధర కల్గిన 32 జీబీ వేరియంట్ ఈ ఫోన్ రూ.11,999కే లభించనుంది. అంతేకాక 16జీబీ వేరియంట్ ఫోన్ రూ.10,499కు అందుబాటులో ఉంచనున్నట్టు అమెజాన్ పేర్కొంది.
మోటో జీ 4 ప్లే ఫోన్:
మోటో జీ ప్లే 4వ తరం ఈ ఫోన్పై రూ.500 వరకు డిస్కౌంట్ను ఈ వెబ్సైట్ ఆఫర్ చేయనుంది. రూ.8,999 ధర కల్గిన ఈ ఫోన్, రూ.8,499కి కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది.
వీటితో పాటు స్టాండర్డ్ చార్టడ్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం క్యాష్బ్యాక్ను, హెచ్డీఎఫ్సీ కార్డులపై 5 శాతం క్యాష్బ్యాక్ను అమెజాన్ ఆఫర్ చేయనుంది. అదనంగా ఈఎంఐలో మోటో జడ్ ప్లే ఫోన్న కొనుగోలు చేసిన కస్టమర్లకు, అమెజాన్.ఇన్ గిప్ట్ రూపంలో క్యాష్ బ్యాక్ను అందించనున్నామని వెల్లడించింది.
Advertisement
Advertisement